Hyderabad: కొడుకు డ్రైవింగ్ సరదా కొంపముంచింది.. బ్రేక్ అనుకుని క్లచ్ తొక్కడంతో కారు ప్రమాదం
హైదరాబాద్ శివారులో అత్యుత్సాహం ప్రాణాల మీదకు తెచ్చింది. డ్రైవింగ్ నేర్చుకునే క్రమంలో కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తండ్రి కొడుకులు ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.
Car Road Accident: హైదరాబాద్(Hyderabad) మహానగరం శివారులో అత్యుత్సాహం ప్రాణాల మీదకు తెచ్చింది. డ్రైవింగ్ నేర్చుకునే క్రమంలో కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తండ్రి కొడుకులు ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్(Pet Basheerabad) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీడిమెట్ల డివిజన్ అంథోని స్కూల్ ముందు సుచిత్రా రోడ్డు లో కారు అదుపు తప్పి రోడ్డు ప్రక్కన కంస్ట్రక్షన్ అవుతున్న సెల్లార్ గుంతలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన అర్ధ రాత్రి 11:30 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు గాయాలతో బయట పడినట్లు పేర్కొన్నారు.
గాయపడ్డ ఇద్దరిని స్థానికుల సహాయంతో సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇదిలావుంటే, తండ్రి కొడుకు కు డ్రైవింగ్ నేర్పుతుండగా ప్రమాదవశాత్తు బ్రేక్ అనుకోని క్లచ్ తొక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ద్వారా సమాచారం.
Read Also… Harish Rao Letter: తెలంగాణ బకాయిల సంగతేంటి.. కేంద్రానికి మంత్రి హరీశ్ రావు మరోసారి లేఖ..!