Bihar Massive Fire: మధుబని రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న రైలులో మంటలు..!

బీహార్‌లో పెను ప్రమాదం తప్పింది. మధుబని రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం నిలబడి ఉన్న రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి వస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి.

Bihar Massive Fire: మధుబని రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న రైలులో మంటలు..!
Rail Fire Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 19, 2022 | 2:03 PM

Massive Fire Breaks in Rail: బీహార్‌(Bihar)లో పెను ప్రమాదం తప్పింది. మధుబని(Madhubani) రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం నిలబడి ఉన్న రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి వస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ ఎక్స్‌ప్రెస్‌(Freedom fighter Express)లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు పెరిగి రైలు దహనం చేయడం ప్రారంభించింది. అదృష్టవశాత్తూ, రైలులో మంటలు చెలరేగినప్పుడు ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే స్టేషన్‌లో ఉన్న వ్యక్తులు, సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం ప్రారంభించారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మూడో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై పార్క్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్ ఎక్స్‌ప్రెస్ బోగీల్లో మంటలు చెలరేగాయి. ఇప్పటి వరకు రెండు కోచ్‌లు కాలిపోయాయని చెబుతున్నారు. కాగా మూడో బోగీ కూడా మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. రైలు రేక్‌ని జైనగర్‌ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, “శనివారం ఉదయం 09.13 గంటలకు సమస్తిపూర్ డివిజన్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఖాళీ రైలు కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే చర్యలు తీసుకుని 09:50 గంటలకు మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌లు దర్యాప్తు చేస్తున్నాయి. దీన్ని రైల్వే యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఉన్నత స్థాయి విచారణ జరుపుతామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.

Read Also…. Basthi Dawakhana: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. టిమ్స్‌లో పేదలకు అన్ని రకాల కార్పోరేట్ వైద్యంః హరీష్ రావు

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?
RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?