IOC Session: 40 సంవత్సరాల తర్వాత ముంబైలో 2023 ఐఓసీ ఈవెంట్.. వేదికగా జియో వరల్డ్ సెంటర్..

IOC Session: 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తదుపరి సెషన్‌కు ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. IOC సెషన్ 2022లో ఓటింగ్ సెషన్ తర్వాత సిటీ ఆఫ్ డ్రీమ్స్ అధికారికంగా..

IOC Session: 40 సంవత్సరాల తర్వాత ముంబైలో 2023 ఐఓసీ ఈవెంట్.. వేదికగా జియో వరల్డ్ సెంటర్..
Follow us
Subhash Goud

|

Updated on: Feb 19, 2022 | 2:14 PM

IOC Session: 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తదుపరి సెషన్‌కు ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. IOC సెషన్ 2022లో ఓటింగ్ సెషన్ తర్వాత సిటీ ఆఫ్ డ్రీమ్స్ అధికారికంగా హోస్ట్ సిటీగా పేరు పొందింది. మొత్తం 82 మంది IOC సభ్యులు ఓటింగ్‌కు అర్హత సాధించారు. వారిలో 6 మంది గైర్హాజరు కావడానికి ఓటేయగా , 75 మంది సభ్యులు అవును అని ఓటు వేశారు. తదుపరి IOC సెషన్‌కు ఆతిథ్యమిచ్చిన ముంబైకి వ్యతిరేకంగా ఒక్క ఓటు మాత్రమే పడింది. IOC సెషన్ అనేది ఐఓసీ సభ్యుల సాధారణ సమావేశం. ఇది IOC ఇవెంట్‌ 2023 ఎడిషన్ జియో వరల్డ్ సెంటర్‌లో జరగనుంది. అయితే 40 ఏళ్ల తర్వాత ఈ ఈవెంట్‌ జరగనుంది.

ఇటువంటి ప్రతిష్టాత్మక ఒలింపిక్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చినందుకు ఈ రోజు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా ఉంది అని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ అన్నారు. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నీతా అంబానీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. 2023 సెషన్‌ను ముంబైకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపారు. ముంబై 2023 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్‌ను నిర్వహించడం సామాన్యమైన విషయం కాదని, ఇందుకు గర్వంగా ఉందని, క్రీడా హోరిజోన్‌లో భారతదేశాన్ని ముందుకు నెట్టడానికి ఒక అవకాశంగా భావిస్తున్నట్లు ఉద్ధవ్‌ థాకరే అన్నారు. 2023 సెషన్‌ను మహారాష్ట్రలోని ముంబైకి తీసుకురావడానికి నీతా అంబానీ జీ కృషి చేశారన్నారు. 2023లో జరిగే ఐఓసీ సెషన్‌ 2030 వింటర్‌ ఒలింపిక్స్‌కు అతిథ్య నగరాన్ని ఎంచుకుంది. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో జరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ఇంతకు ముందు 1983లో న్యూఢిల్లీలో ఐఓసీ సెషన్‌ నిర్వహించింది.

Ioc