Coldest Marathon: గడ్డకట్టే చలిలో జనం పరుగులు..‘వరల్డ్స్ కోల్డెస్ట్ మారథాన్’గా గిన్నిస్ రికార్డు.. ఎక్కడంటే..
Coldest Marathon: చలిగాలులు వీస్తుంటే.. నిద్రలేవాలంటే బద్ధకం.. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే.. ఆమ్మో మా వల్ల కాదు అనేస్తాం.. అయితే గడ్డ కట్టే చలిలో..
Coldest Marathon: చలిగాలులు వీస్తుంటే.. నిద్రలేవాలంటే బద్ధకం.. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే.. ఆమ్మో మా వల్ల కాదు అనేస్తాం.. అయితే గడ్డ కట్టే చలిలో కొంతమంది జనం పరుగులు తీస్తున్నారు. కనురెప్పలు సహా ముఖమంతా మంచు కప్పేసినా.. నోటిలోని లాలాజలం సైతం గడ్డకట్టిపోతున్నా.. లెక్క చేయకుండా లక్ష్యంవైపు దూసుకుపోతున్నారు. అవును.. అదొక పరుగు పందెం.. అలాంటి ఇలాంటి పరుగు పందె కాదు.. రష్యాలోని సైబీరియాలో ఉన్న ఓమ్యకోన్‌లో ఇటీవల జరిగిన మంచు మారథాన్. ఈ మారథాన్‌లో 42.19 కిలో మీటర్లు ఆగకుండా పరుగెత్తి గమ్యం చేరుకోవాలి. అయితే ఇందులో ఏముంది.. శరీరాన్ని వెచ్చని దుస్తులతో కప్పులుని పరిగెడుతున్నారు కదా.. ఇదీ కూడా విశేషమా అని పెదవి విరుస్తున్నారు.. అవును అలా చలిలో ఉన్ని దుస్తులు కప్పుకుని పరిగెత్తడమూ ఓ విశేషమే మరి. ఎందుకంటే ఈ పోటీ జరిగిన సమయంలో అక్కడ ఉష్ణోగ్రత ఎంతో తెలుసా? మైనస్ 53 డిగ్రీల సెల్సియస్. ఇంత చల్లటి ఉష్ణోగ్రతల్లో జరిగిన పోటీ కాబట్టే ‘వరల్డ్స్ కోల్డెస్ట్ మారథాన్’గా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ పోటీలో అమెరికా, రష్యా, యూఈఏ, బెలారస్‌కు చెందిన 65 మంది పరుగువీరులు అత్యంత ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా పాల్గొన్నారు.
Think you’ve run in the cold? ❄️
The world’s coldest marathon took place this weekend in Yakutia, Siberia and it was -53C, with local Vasily Lukin completing it in 3:22.
? @siberian_times pic.twitter.com/qsnxJ2dbS3
— AW (@AthleticsWeekly) January 23, 2022
సుమారు 100 మంది స్థానికులు ఈ పోటీని చూసేందుకు, పోటీదారులను ఉత్సాహపరిచేందుకు వచ్చారు! పురుషుల విభాగంలో రష్యాకు చెందిన వ్యాసిలీ ల్యూకిన్ 3 గంటల 22 నిమిషాల్లో ఈ మారథాన్‌ను పూర్తి చేయగా మహిళల విభాగంలో సైబీరియా ప్రాంతానికి చెందిన మెరీనా సెడలిస్చెవా 4 గంటల 9 నిమిష్యాల్లో గమ్యం చేరుకుంది. ఏటా దాదాపు 10 నెలలు మంచు దుప్పటిలో ఉండే ఓమ్యకాన్ ప్రాంతంలో చలి తీవ్రత ఎంతలా ఉంటుందంటే అక్కడ ఎవరైనా మరణిస్తే వారికి అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశం గడ్డకట్టకుండా ఉండేందుకు రోజుల తరబడి పెద్దపెద్ద మంటలు వేయాల్సి ఉంటుందట! అంతటి ప్రతికూల వాతావరణంలో ఎందుకు పరుగులు పెట్టడం? అని పోటీదారులను అడిగితే ‘గల్లీలో సిక్సర్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టే వాడికే ఓ రేంజ్ ఉంటుంది’ అనే తరహాలో బదులిచ్చారు.
Also Read: