Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్షణాల్లో కోటీశ్వరుడయ్యాడు.. 42 సెకన్లలో ఎంత సంపాదించాడో తెలుసా..??

అమెరికాకు చెందిన జొనాథన్ మా(Jonathan Ma) అనే వ్యక్తి క్షణాల వ్యవధిలోనే కోట్లు సంపాందించాడు. కేవలం 42 సెకన్లలోనే రూ.1.75 ఆర్జించి కోటీశ్వరుడయ్యాడు. క్రిప్టో వంటి డిజిటల్ కరెన్సీ అయిన..

క్షణాల్లో కోటీశ్వరుడయ్యాడు.. 42 సెకన్లలో ఎంత సంపాదించాడో తెలుసా..??
U Tuber
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 19, 2022 | 9:46 AM

అమెరికాకు చెందిన జొనాథన్ మా(Jonathan Ma) అనే వ్యక్తి క్షణాల వ్యవధిలోనే కోట్లు సంపాందించాడు. కేవలం 42 సెకన్లలోనే రూ.1.75 ఆర్జించి కోటీశ్వరుడయ్యాడు. క్రిప్టో వంటి డిజిటల్ కరెన్సీ అయిన నాన్-ఫంగబుల్ టోకెన్‌(NFT)లతో సెకన్ల వ్యవధిలో ఈ మొత్తాన్ని సంపాదించి.. ఓవర్‌నైట్​సెన్సేషన్‌గా మారాడు ఈ యూట్యూబర్. కాలిఫోర్నియాకు చెందిన ఈ యువ యూట్యూబర్ జొనాథన్..​ ‘జోమా టెక్’ పేరుతో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, క్రిప్టో కరెన్సీ, టెక్నాలజీకి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటాడు. ఆయన ఛానెల్​కు 16 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల ప్రారంభంలో ‘వ్యాక్సీడ్​ డాగ్​గోస్​’ పేరుతో ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్​ను విడుదల చేశారు. ఇదే ఆయనకు 2,34,000 డాలర్లు తెచ్చి పెట్టింది. అంటే ఆ మొత్తం భారతీయ కరెన్సీలో సుమారు రూ.1.75 కోట్లు ఉండటం విశేషం. అది కూడా కేవలం 42 సెకన్లలోనే రావడం ఆశ్చర్యపరుస్తోంది. సినిమాలకు దర్శకత్వం వహించాలనే తన కలను ఈ డబ్బులతో తీర్చుకుంటానని జొనాథన్‌ ఆనందం వ్యక్తం చేశారు.

డిజిటల్ కళాకృతిని బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ రూపంలో నిల్వ చేయడాన్ని ఎన్ఎఫ్‌టీ అంటారు. అలా జొనాథన్ తన ఎన్‌ఎఫ్‌టీ సేకరణను విడుదల చేశారు. అతను ఎన్‌ఎఫ్‌టీ సేకరణల కోసం డిస్కార్డ్ సర్వర్‌ని నిర్మించారు. జొనాథన్ ఎన్ఎఫ్‌టీని కలిగి ఉన్న ఎవరైనా దానిని ప్రైవేట్ డిస్కార్డ్‌లో చూడగలరు. ఎన్ఎఫ్టీలను ఉపయోగించి ఫొటోలు, వీడియోలు, ఆడియో ఇతర రకాల ఫైల్స్ దాచుకోవచ్చు. డాప్‌ రాడార్ ప్రకారం గతేడాది 18 వేల కోట్లకు పైగా ఎన్‌ఎఫ్‌టీలు అమ్ముడయ్యాయి.

Also Read

Ram Charan : నయా లుక్‌తో రచ్చ చేస్తున్న మెగాపవర్ స్టార్.. ఆ సినిమా కోసమేనా..

అతనో మోటివేషనల్ స్పీకర్.. చేసింది తెలిస్తే మాత్రం షాక్ అవడం పక్కా

Hyderabad Illegal Construction: జీహెచ్ఎంసీ పరిధిలో రెచ్చిపోతున్న అక్రమార్కులు.. నాయకులే రియల్టర్లైతే ఇలాగే ఉంటుంది మరి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..