Hyderabad Illegal Construction: జీహెచ్ఎంసీ పరిధిలో రెచ్చిపోతున్న అక్రమార్కులు.. నాయకులే రియల్టర్లైతే ఇలాగే ఉంటుంది మరి..

Hyderabad Illegal Construction: ఓవైపు కూలుస్తున్నా.. మరో వైపు టాస్క్ ఫోర్సు అధికారులు చర్యలు తీసుకుంటున్నా..

Hyderabad Illegal Construction: జీహెచ్ఎంసీ పరిధిలో రెచ్చిపోతున్న అక్రమార్కులు.. నాయకులే రియల్టర్లైతే ఇలాగే ఉంటుంది మరి..
Illegal Constructions
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 19, 2022 | 8:59 AM

Hyderabad Illegal Construction: ఓవైపు కూలుస్తున్నా.. మరో వైపు టాస్క్ ఫోర్సు అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. మనల్ని కాదన్నట్టు వ్యవహారిస్తున్నారు రియల్టర్లు. నాయకులే రియల్టర్లుగా మారి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టాడాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. అక్రమంగా వెలుస్తున్న భవనాలను కూలుస్తున్నా.. ఆకాశన్నంటే అపార్ట్‌‌మెంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి. టీఎస్- బీపాస్ చట్టం కింద కనీసం ధరఖాస్తూ కూడా పెట్టుకోకుండానే మేఘాలకు తాకే కోటలను నిర్మిస్తున్నారు రియల్ ఎస్టేట్ అధికారులు. స్థానిక నేతల అండదండలతో ఇష్టమెచ్చినట్లు రెచ్చిపోతున్నారు.

ఇందులో మరో ట్వీస్ట్ కూడా ఉంది. స్థానిక నేతలు మరో డబుల గేమ్ అడుతున్నారు. వారి పర్మిషన్ తీసుకోకుండా.. లంచాలు ఇవ్వకుండా సరైన పద్దతిలో అపార్ట్‌మెంట్లు నిర్మించిన వారిపై.. అధికారులను ఉసిగొల్పి డబ్బుకోసం బెదిరిస్తున్నారు. లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. నిజాంపేట, తుర్కయాంజల్‌, పీర్జాదిగూడ, బోడుప్పల్‌ ఇలా ఎక్కడ చూసినా.. రియల్టర్లైన కార్పోరేటర్ల దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ఇటీవల మణికొండలో భారీగా బిల్డింగులు, అపార్ట్‌మెంట్లను కూల్చేశారు. అటు నగర శివార్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇల్లైతే ఓ రేటు, అపార్ట్‌మెంట్‌ అయితే మరోరేటు, షాపింగ్‌ కాంప్లెక్సులు నిర్మిస్తే బడారేటులా వీరి దందా పెరిగిపోయింది. రెండేళ్లుగా అక్రమ కట్టడాలు సాగుతున్నా నగరపాలక సంస్థ పరిశీలించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. హెచ్ఎండీఏ, జిల్లా టాస్స్ ఫోర్స్ అధికారులు ఇప్పటికే 186 అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్న ఇంకా వెలుస్తూనే ఉన్నాయి.

Also read:

OU Fake Certicates: ఉస్మానియా యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం.. అధికారుల పాత్రపై అనుమానాలు..

Yadadri: యాదాద్రిలో మహా యాగం వాయిదా.. ఆలయ ఉద్ఘాటన తర్వాతే నిర్వహణ

PM Modi: ఎన్నికలకు ముందు సిక్కులతో ప్రధాని మోడీ సమావేశం.. వ్యూహం ఫలించేనా..?