AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadadri: యాదాద్రిలో మహా యాగం వాయిదా.. ఆలయ ఉద్ఘాటన తర్వాతే నిర్వహణ

తెలంగాణలోని యాదాద్రి(Yadadri) లో మార్చి 21 నుంచి నిర్వహించాలనుకున్న శ్రీ సుదర్శన నారసింహ మాహాయాగం వాయిదా పడింది. ఈ మేరకు యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు..

Yadadri: యాదాద్రిలో మహా యాగం వాయిదా.. ఆలయ ఉద్ఘాటన తర్వాతే నిర్వహణ
Yadadri
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 19, 2022 | 8:44 AM

తెలంగాణలోని యాదాద్రి(Yadadri) లో మార్చి 21 నుంచి నిర్వహించాలనుకున్న శ్రీ సుదర్శన నారసింహ మాహాయాగం వాయిదా పడింది. ఈ మేరకు యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు వివరాలు వెల్లడించారు. పునర్నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయ మహాకుంభ సంప్రోక్షణ వేడుకలో భాగంగా వచ్చే నెల 21 నుంచి నిర్వహించాలనుకున్న శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. క్షేత్రాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికానందునే యాగాన్ని వాయిదా వేశామని అన్నారు. ఆలయ ఉద్ఘాటన తరువాత యాగం నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించారు. ఫలితంగా యాగం నిర్వహణకు మరో ముహూర్తం ఖరారు చేస్తామన్నారు. మూలవరుల దర్శనం మాత్రం గతంలో నిశ్చయించినట్టుగా మార్చి 28 నుంచే ఉంటుందని వివరించారు. ప్రస్తుతం పంచనారసింహుల ప్రతిష్ఠామూర్తుల దర్శనాలు, భక్తుల ఆర్జిత సేవలు సాగుతున్న బాలాలయాన్ని మార్చి 27 వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

యాదాద్రి దివ్యక్షేత్రం మహాకుంభ సంప్రోక్షణకు ముస్తాబవుతోంది. పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. కృష్ణ శిలలతో లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. భక్తులకు మరపురాని మధురానుభూతి పంచేలా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు. స్వయంభువుల దర్శనాలకు ఇంకా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో కొండపై లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు శివాలయాన్ని పునర్నిర్మించారు. పరిసరాల్లోనే విష్ణు పుష్కరిణి, ప్రసాదాల తయారీ, విక్రయ సముదాయం, క్యూ కాంప్లెక్స్‌ కడుతున్నారు. బ్రహ్మోత్సవ మండపం నిర్మించారు. కొండపై ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేశారు. కొండ చుట్టూ పచ్చని మొక్కలు నాటి ఆహ్లాదకరంగా రూపొందిస్తున్నారు. క్షేత్ర సందర్శనకు వచ్చే వీఐపీలు సేదతీరేందుకు రూ.3 కోట్లతో అతిథిగృహం, రూ.2.5 కోట్లతో ఈవో ఛాంబర్‌ నిర్మించారు.

Also Read

LIC IPO: ఎల్ఐసీ ఐపీఓలో ఎవరికి ఎన్ని షేర్లు ఇవ్వనుంది.. ఎల్ఐసీ దాచిన వాస్తవాలు ఇప్పుడు మీకోసం..

Bheemla Nayak: భీమ్లానాయకుడు గురిపెట్టింది ఆ రికార్డుల పైనే.. రిలీజ్ అయితే రచ్చ రచ్చ..

Sunny Leone: సన్నీ లియోన్‌కు కోపం తెప్పించిన కేటుగాడు.. కారణం ఏంటంటే