Bheemla Nayak: భీమ్లానాయకుడు గురిపెట్టింది ఆ రికార్డుల పైనే.. రిలీజ్ అయితే రచ్చ రచ్చే..
రింగులోకి దిగుతున్నావ్... రిస్కు తీసుకుంటున్నట్టున్నావ్.. జర భద్రం బాస్ అని ఒకవైపు భయపెడుతున్నా.. వెనక్కు చూడ్డం లేదు భీమ్లానాయకుడు.
Bheemla Nayak: రింగులోకి దిగుతున్నావ్.. రిస్కు తీసుకుంటున్నట్టున్నావ్.. జర భద్రం బాస్ అని ఒకవైపు భయపెడుతున్నా.. వెనక్కు చూడ్డం లేదు భీమ్లానాయకుడు. పైగా.. రెట్టించిన ఉత్సాహంతో కొత్తకొత్త టార్గెట్లను ఫిక్స్ చేసుకుంటున్నాడు. భీమ్లా అంచనాలు మిస్ కాకూడదన్న కమిట్‌మెంట్‌తో ప్రొడ్యూసర్లు కూడా కావల్సిన ఆయుధాలన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇంతకీ భీమ్లా గురిపెట్టింది ఏ రికార్డుల మీద అంటే.. మహా అయితే పదిరోజులు. లాఠీ గాయకుడు, డ్యూటీ సేవకుడు, భీమ్లానాయకుడు వెండితెరపై దర్శనమివ్వబోతున్నాడు. ఈ మూమెంట్‌లో ఫ్యాన్స్‌కైతే గాల్లో తేలినట్టే వుంది. మేకర్స్ పరిస్థితి మాత్రం మరోలా వుంది. ఈ పదిరోజుల షార్ట్ గ్యాప్‌లోనే ప్రమోషన్ వర్క్‌ని కంప్లీట్ చేయాలి. ట్రైలర్ లాంచ్, ప్రిరిలీజ్ఈవెంట్ లాంటి కార్యక్రమాల మీద సీరియస్ వర్కవుట్స్ జరుగుతున్నాయి.
కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చేస్తోందనగా.. ప్రతికూల పరిస్థితుల్లోనే కూడా ఎదురీది.. దిగ్విజయంగా వంద కోట్ల క్లబ్బులో చేరింది వకీల్‌సాబ్ మూవీ. ఇప్పుడు అంతకంటే పవర్‌ఫుల్ సబ్జెక్ట్.. పైగా మల్టిస్టారర్ మూవీ.. కావల్సినంత కమర్షియల్ డోస్ వున్న భీమ్లానాయక్ ఎంత కలెక్ట్ చెయ్యొచ్చన్న అంచనాలు ఇండస్ట్రీని హీటెక్కిస్తున్నాయి. బిగ్ స్క్రీన్స్‌పై పెద్ద సినిమా చూసి దాదాపు రెండు నెలలవుతోంది. పవర్‌స్టార్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్‌తో పాటు, యావరేజ్ సినీ లవర్ కూడా భీమ్లా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు. మాసివ్ ఓపెనింగ్స్‌తో అదరగొట్టడం ఖాయమన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది బయ్యర్స్ దగ్గర. నైజామ్ రైట్స్ కొనేసిన దిల్ రాజయితే.. తనదైన స్టయిల్‌లో థియేటర్ బిజినెస్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. టోటల్‌గా సింగిల్ లాంగ్వేజ్‌లోనే 200 కోట్లు వసూలౌతుందనేది ఇప్పటికున్న ఒక ప్రైమరీ కాలిక్యులేషన్.
వారంలోగా ఏపీలో కొత్త జీవో వస్తుందని, 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి లభిస్తుందని ఆశాభావంతో వున్నారు ప్రొడ్యూసర్లు. B అండ్ C సెంటర్స్ అయితే ఇప్పటికే ఆఫ్‌లైన్ బుకింగ్స్‌లో అన్ని సీట్లూ అమ్మేసుకుంటున్నాయి. అటు… అదే తేదీకి రాబోతున్న మిగతా మూడు సినిమాలకు థియేటర్ల పంపకాలపై పంచాయితీ కూడా మొదలైంది. ఆలియా భట్ సినిమాతో సమస్య లేకపోయినా శర్వానంద్, వరుణ్‌తేజ్ మూవీస్ మాత్రం భీమ్లానాయక్‌కి ఎంతోకొంత పోటీకొచ్చే ఛాన్సుంది. ఓవర్సీస్‌లో అజిత్ మూవీ వలిమై ఇప్పటికే బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. కొన్నిచోట్ల సోల్డ్‌ఔట్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. మరి.. సడన్‌గా అనౌన్స్ అయిన భీమ్లానాయక్‌కి ఎన్ని స్క్రీన్లు రిజర్వు అవుతాయనేది ఇప్పటికైతే సస్పెన్సే. భీమ్లా హిందీ వెర్షన్ కూడా నామమాత్రంగానే రిలీజౌతోంది. సో… తెలుగు మార్కెట్స్‌లో హోల్ అండ్ సెల్ విక్టరీ కొట్టడానికి.. అన్ని మార్గాల్నీ వెతుకుతున్నాడు భీమ్లానాయకుడు.
మరిన్ని ఇక్కడ చదవండి :