AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NBK107: మొదలైన బాలయ్య 107వ సినిమా.. సిరిసిల్లలో షూటింగ్ ప్రారంభం..!

Nandamuri Balakrishna: అఖండ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ, ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో సినిమా షూటింగ్ మొదలైంది.

NBK107: మొదలైన బాలయ్య 107వ సినిమా.. సిరిసిల్లలో షూటింగ్ ప్రారంభం..!
Nandamuri Balakrishna Gopichand Malineni Mythri Movie Makers Nbk107
Venkata Chari
|

Updated on: Feb 19, 2022 | 5:45 AM

Share

Nandamuri Balakrishna 107 Movie: అఖండ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా త‌ర్వాత న‌టిసింహా నంద‌మూరి బాల‌కృష్ణ(Balakrishna) హీరోగా, డైరెక్టర్ గోపిచంద్ మ‌లినేని కాంబోలో కొత్త సినిమా ప్రారంభం అయింది. ఈ సినిమా బాల‌య్య‌107(Balayya107)వ సినిమాగా రానుంది. ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ సినిమా భారీగా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా మైత్రి మూవీ మేక‌ర్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించనుంది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ శుక్రవారం తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో‌ మొదలైంది. శుక్రవారం మొదలైన ఈ సినిమా.. ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో మొదలుపెట్టారు. ఇందులో ఫైటర్స్‌తో బాలయ్య బాబు యాక్షన్ ఎపిసోడ్ తీశారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఈ యాక్షన్ ఎపిసోడ్‌కు కొరియోగ్రఫీ చేశారు.

మాస్ హీరోతో మాస్ ద‌ర్శ‌కుడు కలిసి తీస్తోన్న ఈ సినిమా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా నిర్మిస్తోన్నట్లు డైరెక్టర్ గోపీచంద్ మలినేని పేర్కొన్నారు. ఈ సినిమాలో బాలయ్య బాబు స‌ర‌స‌న శృతి హాస‌న్ కథనాయికిగా నటిస్తోంది. ఈ మాస్ సినిమాలో విలన్‌గా క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ టాలీవుడ్‌‌కు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో వరలక్ష్మీ నటించనుంది.

న‌వీన్ ఎర్నేని, వై. ర‌వి శంక‌ర్ సంయుక్తంగా ఈ సినిమాను తీస్తున్నారు. అలాగే ఈ సినిమాకు తమన్ మ్యూజిక్‌ను అందిస్తుండగా, మాటలు సాయి మాధవ్ బుర్రా, సినిమాటోగ్రఫర్ రిషీ పంజాబీ, ఎడిటర్‌గా నవీన్ నూలీ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Also Read: Alia Bhatt: అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్న అలియా భట్ లేటెస్ట్ పిక్స్

Malavika Mohanan: పాన్ ఇండియా స్టార్ సరసన ఛాన్స్ దక్కించుకున్న మాస్టర్ బ్యూటీ.?

Follow Us
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి