Kavya Thapar: తప్పతాగి పోలీసులకు దొరికిన టాలీవుడ్ హీరోయిన్.. మద్యం మత్తులో హల్చల్ చేసిన నటి
ఏక్ మినీ కథతో ఫేమస్ బ్యూటీగా మారిన.. టాలీవుడ్ హీరోయిన్ కావ్య తాపర్ ను అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాఫిగ్ అయింది.

Kavya Thapar: ఏక్ మినీ కథతో ఫేమస్ బ్యూటీగా మారిన.. టాలీవుడ్ హీరోయిన్ కావ్య తాపర్ ను అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాఫిగ్ అయింది. మద్యం మత్తులో కావ్య తాపర్ హల్చల్ చేసింది. నటి చేసిన రచ్చకు ముంబై పోలీసులు షాక్ కు గురయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఓ వ్యక్తి కారును ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా పోలీసులపై దాడి చేసి.. దుర్భాషలాడింది. దీంతో హీరోయిన్ కావ్య తాపర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నటిని అంధేరి కోర్టులో హాజరుపరిచారు. కావ్య తాపర్ ను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది కోర్టు. అయితే జుహులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ ఎదుట యాక్సిడెంట్ జరిగినట్లు జుహు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ రావడంతో … నిర్భయ స్క్వాడ్, పలు విభాగాలకు చెందిన పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
యాక్సిడెంట్ పై కావ్య నుంచి వివరాలు సేకరిస్తుండగా మహిళా పోలీస్ అధికారి కాలర్ పట్టుకొని, బూతులు తిడుతూ దురుసుగా ప్రవర్తించిందని పోలీసులు చెప్పారు. దీంతో బ్యూటీ కావ్యను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక కావ్య తాపర్ 2013లో తక్తల్ షార్ట్‌ఫిలింతో సినీరంగ ప్రవేశం చేసింది. 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మార్కెట్ రాజా ఎంబీబీఎస్ తమిళ చిత్రం, 2021లో వచ్చిన ఏక్ మినీ ప్రేమకథ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. మొత్తానికి ఈ చిత్రం ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించడంతో కావ్య తాపర్‌కు మంచి బ్రేక్ వచ్చింది.. ఫేమస్ హీరోయిన్ గా పాపులర్ అయింది.
మరిన్ని ఇక్కడ చదవండి :




