Sunny Leone: సన్నీ లియోన్‌కు కోపం తెప్పించిన కేటుగాడు.. కారణం ఏంటంటే
న్యూస్ మేకర్ గా మారింది బాలీవుడ్ నటి సన్నీ లియోన్. అమ్మడికి పట్టారని కోపంతో ఊగిపోయింది.. ఇంతకు సన్నీ కోపానికి కారణం ఏంటంటే..
Sunny Leone: న్యూస్ మేకర్ గా మారింది బాలీవుడ్ నటి సన్నీ లియోన్. అమ్మడికి పట్టారని కోపంతో ఊగిపోయింది.. ఇంతకు సన్నీ కోపానికి కారణం ఏంటంటే.. ఎవరో ఇడియట్ తన పాన్ కార్డు సాయంతో 2 వేల రూపాయలు లోన్ తీసుకుని సీబీల్ స్కోరును దెబ్బతీశాడని మండిపడింది సన్నీలియోన్. ఈ విషయంలో IVL సెక్యూరిటీస్ తనుక సాయం చేయకపోగా.. ఇండియాబుల్స్ దీన్ని ఎలా అనుమతిస్తుందంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది సన్నీ లియోన్. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కొద్ది సేపటికే IVLను తిడుతూ చేసిన ట్వీట్ ను డిలిట్ చేసింది సన్నీ. అంతేకాదు IVL కు థ్యాంక్స్ చెప్పింది. ఐవీఎల్ సెక్యూరిటీస్, ఐబీ హోమ్ లోన్స్, సీబీల్‌కు ధ్యాంక్యూ అంటూ ట్విట్టర్ లో రాసుకోచ్చింది. తాను ఫిర్యాదు చేసి క్షణాల్లోనే సమస్యను పరిష్కరం దొరికిందని చెప్పింది. ఇకపై ఇలాంటివి పునరావృతం కావని తాను నమ్ముతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది సన్నీ.
చెత్త సీబీల్ స్కోర్‌ను ఎవరూ కోరుకోరు’ అంటూ ట్వీట్ చేసింది. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు రోజుల్లో వేల సంఖ్యలో జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత అవి పరిష్కారమవుతాయి. కానీ సన్నీ లియోన్ తొందరపడి ఐవీఎల్ సెక్యూరిటీని విమర్శించడం, ఆ తర్వాత ట్వీట్ డిలిట్ చేయడం, మళ్లీ ఆమే పొగడడం విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ తతంగమంతటిపై సోషల్ మీడియా వేదికగా సన్నీలియోన్ పై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. సన్నీలియోన్ స్థాయి వ్యక్తి కేవలం రెండు వేల రూపాలయ విషయంలో సిబిల్ స్కోర్ పొగొట్టుకోవడం ఆమె ఆగ్రహంలో తప్పేలేదంటున్నారు మరికొందరు. కొందరు లోన్ తీసుకోవడం ఆడ్రస్ లు మాత్రం ప్రముఖులవి జోడిచడం ఇటీవల కాలంలో సర్వసాధరణమైంది. ధని యాప్ లాంటి కొన్ని యాప్ లు ఆన్లైన్ లోన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేయడంతో కొందరు దీనిని వక్రమార్గంగా మార్చుకుంటున్నారు. అయితే లోన్ తీసుకున్న విషయం ఆ వ్యక్తులకు తెలయకపోవడం కూసింత ఆశ్చర్యంగా ఉంది. ధని యాప్ ప్రకటనలు విపరీతంగా రావడంతో యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :