AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమా ఓటీటీ రిలీజ్‌కు మాస్టర్ ప్లాన్ వేస్తున్న మేకర్స్..

మాస్ ఆడియన్స్‌లో తిరుగులేని క్రేజ్‌ ఉన్న ఇద్దరు టాప్‌ హీరోలతో ఇండియాస్‌ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌... పాన్ ఇండియా సినిమాకు కేరాఫ్ అడ్రస్‌ లాంటి గ్రేట్‌ డైరెక్టర్‌...

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమా ఓటీటీ రిలీజ్‌కు మాస్టర్ ప్లాన్ వేస్తున్న మేకర్స్..
Rajeev Rayala
|

Updated on: Feb 19, 2022 | 8:56 AM

Share

Radhe Shyam: రాధేశ్యామ్ రిలీజ్‌కి సరిగ్గా పదిరోజులే గ్యాప్ వుంది. కానీ.. ఈ పదిరోజుల్లో ఏం జరిగినా జరగొచ్చు… గుర్రం పైకి ఎగరా వచ్చు.. ఎగరలేక బొక్కబోర్లా పడనూ వచ్చు. పూటపూటకూ మారిపోతున్న దర్శక నిర్మాతల మైండ్‌ సెట్‌… అభిమానుల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ రాధేశ్యామ్‌ ఫ్యూచర్ మళ్లీ మళ్లీమళ్లీ ఆ క్వశ్చన్‌మార్కులేంటి అనేది ఇప్పుడు చూద్దాం.. రాధేశ్యాముడి జాతక చక్రం మళ్లీ గిర్రున తిరగబోతోందా? ఎస్‌.. డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్‌కి మరోసారి చేతినిండా పని దొరకబోతోంది. మొన్నటిదాకా అప్‌డేట్స్ ఎక్కడ అంటూ రాధేశ్యామ్ మేకర్స్‌ని టార్గెట్‌ చేసీచేసీ చేతులు బాగా నొప్పెట్టేశాయి. ఇప్పుడు రాధేశ్యామ్ రిలీజ్‌ డేట్ విషయంలో పిల్లిమొగ్గలేస్తూ.. మళ్లీ ట్రోలర్లకు దొరికిపొయ్యేలా వున్నారు. ఫిలిమ్‌సిటీ ఈవెంట్‌ తర్వాత సైలెంటయినా.. ఆ తర్వాత వరసబెట్టి మీడియా ఇంటర్వ్యూలిస్తూ.. రాధేశ్యామ్‌ని వన్‌మాన్ ఆర్మీలా మోశారు కెప్టెన్ రాధాక్రిష్ణ. కట్‌చేస్తే..! పరిస్థితేమీ బాగోలేదు.. అందరూ గుండెలు గట్టిపరుచుకోండి.. అంతా మంచే జరగాలని దేవుణ్ణి ప్రార్థించండి అంటూ రాధేశ్యామ్‌ హ్యాష్‌ట్యాగ్‌ మీద నిర్వేదంతో ట్వీట్ చేసి.. రిలీజ్ డేట్ మీద వున్న డౌట్స్‌ని ఇంకా పెద్దవి చేశారు కెప్టెన్ ఆర్కే.

మనం కూడా వెనక్కు తగ్గితే పోలా అంటూ ట్రిపులార్‌ ఐడియాలజీతో సింకవుతూ రెండురోజుల కిందట ఫీలర్స్ వదిలింది రాధేశ్యామ్ క్యాంప్. కానీ ఆ మర్నాడే తూచ్ అనేశారు. పూర్తిగా లాక్‌డౌన్ అయితే తప్ప మా సినిమాను వెనక్కు తీసుకోం అంటూ ప్లేట్ ఫిరాయించేశారు. నార్త్‌లో టార్గెట్ మిస్సయినా తెలుగులో భారీ ఓపెనింగ్స్‌ వుంటాయన్న కాన్ఫిడెన్సయితే మేకర్స్‌లో వుంది. ఇలా సినిమాను వదలాలా వద్దా అనే డైలమాతోనే టైమ్‌పాస్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ప్రమోషనల్ యాక్టివిటీస్‌ కూడా పెండింగ్‌లో పడిపోయాయి. ఒకవేళ రిలీజ్ చేస్తే ఏంటి.. ఆపితే ఏంటి.. అంటూ సైలెంట్‌గా డిఫరెంట్ స్ట్రాటజీస్‌ని వర్కవుట్ చేస్తున్నారు. థియేటర్ అండ్ డిజిటల్.. రెండు ప్లాట్‌ఫామ్స్‌ మీద ఒకేసారి రిలీజ్ చేయాలన్నది ఒక ఐడియా. అటు.. సంక్రాంతికి రిలీజ్ అయ్యాక రెండువారాల్లోనే ఓటీటీకిచ్చేసేలా.. మాస్టర్ సినిమా ఫార్ములాను కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఇదే గనుక జరిగితే.. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లోనే ఆడియన్స్ అరచేతిలోకి వచ్చెయ్యనుంది డార్లింగ్‌ సాలిడ్ లవ్‌ స్టోరీ రాధేశ్యామ్. Tv 9 ET Desk

మరిన్ని ఇక్కడ చదవండి : 

NBK107: మొదలైన బాలయ్య 107వ సినిమా.. సిరిసిల్లలో షూటింగ్ ప్రారంభం..!

Alia Bhatt: అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్న అలియా భట్ లేటెస్ట్ పిక్స్

Malavika Mohanan: పాన్ ఇండియా స్టార్ సరసన ఛాన్స్ దక్కించుకున్న మాస్టర్ బ్యూటీ.?