సమ్మర్‌లో సునామి.. రిలీజ్‌కు ముందే రికార్డుస్థాయిలో బిజినెస్ చేస్తున్న బడా సినిమాలు ఇవే..
మార్చి 25న నాటు కొట్టుడు కొట్టడానికి మేం సిద్ధం అని ట్రిపుల్ ఆర్ మేకర్స్ అలా అనౌన్స్ చేశారో లేదో వెంటనే మిగిలిన సినిమాల రిలీజుల డేట్లు వరుసగా అనౌన్స్ అయ్యాయి.
మార్చి 25న నాటు కొట్టుడు కొట్టడానికి మేం సిద్ధం అని ట్రిపుల్ ఆర్ మేకర్స్ అలా అనౌన్స్ చేశారో లేదో వెంటనే మిగిలిన సినిమాల రిలీజుల డేట్లు వరుసగా అనౌన్స్ అయ్యాయి. 500 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కింది ట్రిపుల్ ఆర్. ప్యాన్ ఇండియా లెవల్లో దాదాపు 800 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అంటే నిర్మాతలు పెట్టిన ఖర్చు, బయ్యర్లు పెట్టిన ఖర్చు అంతా వచ్చేయాలంటే సమ్మర్ సీజన్‌లో పక్కాగా రావాల్సిందే అని అంటున్నారు క్రిటిక్స్ . ట్రిపుల్ ఆర్‌తో మార్చి 25న సౌత్‌కి పరిచయమయ్యే ఆలియా భట్ అంతకు నెల రోజుల ముందే నార్త్ మూవీ డబ్బింగ్ వెర్షన్‌తో సౌత్ ఆడియన్స్ ని పలకరించడానికి సిద్ధమైపోయారు. ఆమె నటించిన గంగూబాయ్ కతియావాడి ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఈ సినిమాలో అలియా లుక్ నుంచి ట్రైలర్ వరకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా కూడా అదే రేంజ్‌లో హిట్ అయితే ట్రిపుల్ ఆర్‌కి మరింత ప్లస్ అయ్యే ఛాన్సులున్నాయి.
నార్త్ ప్లస్ సౌత్ సర్కిల్స్ లో ట్రిపుల్ ఆర్ మూవీకి మాత్రమే కాదు… అంతకు మించి ప్యాన్ రేంజ్ బజ్ క్రియేట్ అయింది రాధేశ్యామ్ చిత్రానికి. విధికీ, ప్రేమకూ జరిగిన యుద్ధంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే రాసుకున్నారు కెప్టెన్ రాధాకృష్ణకుమార్. రాధేశ్యామ్ చిత్రాన్ని 350కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తే 500 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ట్రిపుల్ ఆర్ కన్నా 14 రోజుల ముందే మార్చి 11న విడుదలవుతోంది రాధేశ్యామ్. అంటే ఇప్పుడు అంతకు మించిన కలెక్షన్లను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు డార్లింగ్ ప్రొడ్యూసర్స్. ఆల్రెడీ బాహుబలి, సాహోతో పెరిగిన ప్రభాస్ క్రేజ్, ప్యాన్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్, వరుసగా ప్రభాస్ మిగిలిన ప్రాజెక్టులకున్న క్రేజ్… అన్నీ కలగలిపి ఈ సినిమాను ఇంకో రేంజ్‌లో నిలబెడుతున్నాయి.
రాధేశ్యామ్ లో దాదాపు సగం బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కేజీయఫ్2. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ తో వచ్చిన క్రేజ్… ఈ సీక్వెల్ మీద హోప్స్ పెంచుతోంది. కేజీయఫ్2 సినిమా బడ్జెట్ 200 కోట్లు. అయితే .400 కోట్ల రూపాయలకు పై చిలుకు బిజినెస్ జరిగిందని అంచనా. ఏప్రిల్ 14న నార్త్ లో లాల్‌సింగ్ చద్దా విడుదలైతే, సౌత్ నుంచి గట్టిగా పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు హీరో యష్ అండ్ కెప్టెన్ ప్రశాంత్‌నీల్. సునీల్‌దత్ ఎలివేషన్ కూడా కేజీయఫ్2 మీద గట్టిగా నమ్మకాన్ని పెంచుతోంది. సౌత్ నుంచి స్ట్రాంగ్ సౌండ్ చేస్తున్న మరో హీరో అజిత్. ఆయన నటించిన సినిమా వలిమై. సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకున్నా, కోవిడ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 24న వస్తున్నట్టు గట్టిగా చెప్పేశారు నిర్మాత బోనీకపూర్. ఈ సినిమాలో అజిత్‌తో పాటు మన తెలుగు హీరో కార్తికేయ కూడా ప్యాన్ ఇండియా రేంజ్‌లో ప్రొజెక్ట్ కాబోతున్నారు.
వలిమైలాగానే సంక్రాంతి సీజన్‌ని మిస్ అయిన సినిమా సర్కారువారి పాట. 2022 సంక్రాంతి రిలీజ్ అని అందరికన్నా ముందే లాస్ట్ ఇయర్‌లో ఈ సినిమాకు అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేకర్స్. మహేష్ హెల్త్ రీజన్స్, కోవిడ్ కరుణించకపోవడం.. విషయం ఏదైనా సినిమా మాత్రం వాయిదా పడింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ కెరీర్లో వస్తున్న సినిమా ఇది. అందుకే సర్కారువారిపాట కోసం రూ.200 కోట్లు ఖర్చుపెట్టారు. మినిమమ్ ఇంకో వంద కోట్ల రూపాయల మార్జిన్‌తోనే బిజినెస్ ఉంటుందని అంచనా. స్క్రీన్ మీద సరికొత్తగా కనిపించే మహేష్- కీర్తీ కాంబో, ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే పరశురామ్ డైరక్షన్ ఈ సినిమా మీద అంచనాలు పెంచుతోంది. మే 12న విడుదల కానుంది సర్కారువారి పాట. సోనీ పిక్చర్స్ తో కలిసి మహేష్‌బాబు నిర్మిస్తున్న సినిమా మేజర్. ఎన్నో క్లిష్ట సమయాల్లో సమయస్ఫూర్తిని, ధైర్యసాహసాలను ప్రదర్శించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా మేజర్. అంతా కరెక్ట్ గా ఉంటే మే 27న ప్యాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను విడుదల చేయాలని ఫిక్సయ్యారు మేకర్స్. రీసెంట్‌గా హీరో అడివి శేష్ ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేశారు.
Tv 9 ET Desk
మరిన్ని ఇక్కడ చదవండి :