Singareni news: సింగరేణి కార్మికులకు రూ.40 లక్షలు బీమా.. వేతనం, హోదాకు సంబంధం లేకుండా..

ప్రతి సింగరేణి కార్మికులకు రూ.40 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసేందుకు భారతీయ స్టేట్‌ బ్యాంకు(SBI) అంగీకరించింది. ఎస్బీఐ ఖాతా ఉన్న ప్రతి కార్మికుడికి ఈ సదుపాయం వర్తించనుంది...

Singareni news: సింగరేణి కార్మికులకు రూ.40 లక్షలు బీమా.. వేతనం, హోదాకు సంబంధం లేకుండా..
Singareni
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 19, 2022 | 8:26 AM

ప్రతి సింగరేణి కార్మికులకు రూ.40 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసేందుకు భారతీయ స్టేట్‌ బ్యాంకు(SBI) అంగీకరించింది. ఎస్బీఐ ఖాతా ఉన్న ప్రతి కార్మికుడికి ఈ సదుపాయం వర్తించనుంది. ఈ మేరకు సింగరేణి సంచాలకుడు ఎన్‌.బలరామ్‌, ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అమిత్‌ జింగ్రాన్‌ సమక్షంలో.. హైదరాబాద్‌లోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఒప్పంద పత్రాలపై ఇరు సంస్థల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ఇంతకు మునుపు రూ.20 లక్షలు బీమా సదుపాయం ఉండగా.. ఇకనుంచి రూ.40 లక్షలకు పెంచినట్లు ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగులకు లబ్ధి చేకూరే పలు రాయితీలను కూడా ఇందులో కల్పించారు. కొత్త ఒప్పందం వచ్చే నెల 4వ తేదీ నుంచి అమలులోకి రానుంది. విశ్రాంత కార్మికులకు కూడా ఈ ప్రమాద బీమాను వర్తింపజేయాలని కోరగా.. దీనిపై మరో ప్యాకేజీతో ఒప్పందానికి ముసాయిదా ప్రతిపాదన సమర్పించాలని సంబంధిత అధికారులను అమిత్‌ జింగ్రాన్‌ ఆదేశించారు.

ఉద్యోగి వేతనం, హోదాకు సంబంధం లేకుండా ప్రమాద బీమా కల్పిస్తారు. ప్రమాదంలో శాశ్వత అంగ వైకల్యానికి కూడా రూ.40 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.20 లక్షల బీమా, డిమాండ్‌ డ్రాఫ్ట్‌లకు, పాస్‌ బుక్‌లకు, ఏటీఎం కార్డు లావాదేవీలకు ప్రస్తుతం ఉన్న ఛార్జీలు ఎత్తివేత వంటి సౌకర్యాలూ కల్పిస్తారు. ఏటీఎం కార్డు ద్వారా ప్రస్తుతం ఉన్న రూ.40 వేల గరిష్ఠ విత్‌డ్రా పరిమితి రూ.లక్షకు పెంపు, ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో కూడా ఉచిత విత్‌డ్రా సౌకర్యం, ఉచిత ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలు కల్పించనున్నారు.

మరోవైపు.. సింగరేణి అధికారులకు 2019-20 సంవత్సరానికి సంబంధించి పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని(పీఆర్పీ) ఇంకా చెల్లించలేదని, దీన్ని వీలైనంత త్వరగా ఆమోదించాల్సిందిగా సీఎంవోఏఐ అధ్యక్ష కార్యదర్శులు జక్కం రమేశ్‌, ఎన్‌.వి.రాజశేఖరరావు ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావుకు వినతి పత్రాన్ని అందజేశారు.

Also Read

News Watch: కాంగ్రెస్ కు జగ్గారెడ్డి రాజీనామా !! ఏ పార్టీలో చేరుతున్నారో తెలుసా ?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Medical Officer Jobs:  నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ సంగారెడ్డి జిల్లాలో 103 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. పూర్తివిరాలివే..

నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో కిడ్నాప్ లు.. భార్య కొనిచ్చిన కారుతో అక్రమాలు.. చివరికి..?