నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో కిడ్నాప్ లు.. భార్య కొనిచ్చిన కారుతో అక్రమాలు.. చివరికి..?

డిగ్రీ వరకు చదవినా.. ఉద్యోగం రాకపోవడంతో  డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నాడు. వచ్చే సంపాదన సరిపోకపోవడంతో నేర మార్గాన్ని ఎంచుకున్నాడు. అక్రమంగా డబ్బు సంపాదించేందుకు దొంగగా మారాడు. పోలీసులు అరెస్టు చేయడంతో....

నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో కిడ్నాప్ లు.. భార్య కొనిచ్చిన కారుతో అక్రమాలు.. చివరికి..?
Arrest
Follow us

|

Updated on: Feb 19, 2022 | 7:32 AM

డిగ్రీ వరకు చదవినా.. ఉద్యోగం రాకపోవడంతో  డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నాడు. వచ్చే సంపాదన సరిపోకపోవడంతో నేర మార్గాన్ని ఎంచుకున్నాడు. అక్రమంగా డబ్బు సంపాదించేందుకు దొంగగా మారాడు. పోలీసులు అరెస్టు చేయడంతో.. దొంగతనాలు వదిలేశాడు. అనంతరం ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని కిడ్నాప్ లకు పాల్పడేవాడు. నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ స్ఫూర్తితో అపహరణలకు పాల్పడేవాడు. ముఠాలో యువతిని నియమించుకుని.. యువకులకు, ఉద్యోగులకు వల వేసేవాడు. వారిని అపహరించి, డబ్బు డిమాండ్ చేసేవాడు. వచ్చిన డబ్బులను స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేవాడు. అయితే భార్య కొనిచ్చిన కారుతో కిడ్నాప్ లు చేయడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాప్ ముఠాను అరెస్టు చేశారు.

కర్నూలు(Kurnool) జిల్లాకు చెందిన సురేష్‌ హైదరాబాద్(Hyderabad) ఆసిఫ్ నగర్ లో ఉంటున్నాడు. డిగ్రీ వరకు చదివినా.. ఉద్యోగం రాకపోవడంతో డ్రైవర్‌ వృత్తి ఎంచుకున్నాడు. డ్రైవర్‌గా వచ్చే సంపాదన సరిపోకపోవడంతో నేర ప్రవృత్తిని ఎంచుకున్నాడు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు దొంగగా మారాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్న సురేష్ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో చోరీలకు స్వస్తి చెప్పి.. కిడ్నాప్‌ ముఠా ఏర్పాటు చేశాడు. ఓ యువతిని నియమించుకుని యువకులు, వృత్తి నిపుణులకు వలవేసేవాడు. ఆమె వలలో పడిన వారిని ముఠా సభ్యులతో కలిసి అపహరించి, డబ్బు డిమాండ్‌ చేసేవాడు. వారు ఇచ్చిన డబ్బులతో కర్నూలులో స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేసేవాడు. ఇప్పటి వరకు ఆరుగురిని కిడ్నాప్‌ చేసిన సురేష్‌ ముఠా.. మరో ముగ్గురిని అపహరించేందుకు ప్రణాళిక రచించింది.

కర్నూలు జిల్లాకు చెందిన సురేష్‌ తల్లిదండ్రులు చిన్నప్పుడే హైదరాబాద్‌కు వచ్చేశాడు. తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు చిన్నచిన్న పనులు చేస్తుండగా సురేష్‌ డిగ్రీ వరకు చదివాడు. ఒక సోదరుడు ఘరానా దొంగగా మారడంతో తానూ అదేబాట పట్టాడు. కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకొని భార్యను కారు కొనివ్వాలని కోరాడు. సినిమా షూటింగ్‌లు, ఇతర అవసరాలకు స్పోర్ట్స్‌ కారు కావాలని చెప్పడంతో తాను పొదుపు చేసుకున్న సొమ్ము ఇచ్చేసింది. ఆ డబ్బుతో ఓ స్పోర్ట్స్‌ కారు కొన్నాడు. ఈ కారులోనే తన గ్యాంగ్‌తో కలిసి కిడ్నాప్‌లు చేసేవాడు. సమాచారం అందుకున్న ఆసిఫ్‌నగర్‌ పోలీసులు సురేష్‌ బృందాన్ని అరెస్ట్‌ చేశారు.

Also Read

Sunny Leone: సన్నీ లియోన్‌కు కోపం తెప్పించిన కేటుగాడు.. కారణం ఏంటంటే

పేడతో పిడకలు చేయడం ఎలా ?? యూనివర్సిటీ విద్యార్థులకు శిక్షణ.. వీడియో

Funny Video: ఓరివీడి వేషాలో.. ట్రైన్‌లో సీటు సంపాదించడం కోసం ఏం చేశాడో చూడండి..