NIA: రహస్య పత్రాల లీక్ ఆరోపణలు.. ఐపీఎస్ అధికారి అరెస్టు

ఎన్‌ఐఏ మాజీ ఎస్‌పీ, ఐపీఎస్​ అధికారి అరవింద్ దిగ్విజయ్ నేగీని ఎన్ఐఏ(NIA) అధికారులు అరెస్టు చేశారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు రహస్య పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలపై..

NIA: రహస్య పత్రాల లీక్ ఆరోపణలు.. ఐపీఎస్ అధికారి అరెస్టు
Nia Arrest
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 19, 2022 | 6:59 AM

ఎన్‌ఐఏ మాజీ ఎస్‌పీ, ఐపీఎస్​ అధికారి అరవింద్ దిగ్విజయ్ నేగీని ఎన్ఐఏ(NIA) అధికారులు అరెస్టు చేశారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు రహస్య పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలపై.. నేగీ(Arvind Digvijay Negi) ని అరెస్టు చేసినట్లు తెలిపారు. రహస్య పత్రాల లీకేజీ వ్యవహారంలో ఐపీఎస్ అధికారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన ఓజీడబ్ల్యూగా ఉన్న మరో నిందితుడికి ఏడీ.నేగి.. ఎన్‌ఐఏ అధికారిక రహస్య పత్రాలను లీక్ చేశారని అధికారులు గుర్తించారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల ప్రణాళికల అమలు కోసం లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ విస్తృత నెట్‌వర్క్ వ్యాప్తికి సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.

గతంలో ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్టు చేసింది. తాజాగా రహస్య పత్రాల లీకేజీలో నేగీ పాత్ర ఉన్నట్లు తేలడంతో అతని ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు జరిపింది. నేగీ ప్రస్తుతం సిమ్లా ఎస్పీగా ఉన్నారు. గతేడాది నవంబర్‌లో కశ్మీర్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త ఖుర్రం పర్వేజ్‌ను ఎన్‌ఐఏ ఈ కేసులో అరెస్టు చేసింది. అనేక తీవ్రవాద సంబంధిత కేసులను విచారించిన నేగి.. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఎస్పీగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఓవర్ గ్రౌండ్ వర్కర్లలో ఒక‌రికి నేగీ ఎన్‌ఐఏ అధికారిక రహస్య పత్రాలను లీక్ చేశార‌ని ఆరోప‌ణ ఎదుర్కొంటున్నారు. అయితే ఆయ‌న ఆ ర‌హ‌స్య ప‌త్రాలు ఎవ‌రికి అంద‌జేశార‌నే వివ‌రాల‌ను ఎన్ఐఏ వెల్లడించలేదు.

Also Read

Multibagger Penny Stock: రూ. లక్ష పెట్టుబడి పెడితే.. రూ. 8.5 లక్షలు రిటర్న్ ఇచ్చిన షేర్.. కేవలం 3 నెలల్లో..

NBK107: మొదలైన బాలయ్య 107వ సినిమా.. సిరిసిల్లలో షూటింగ్ ప్రారంభం..!

పేడతో పిడకలు చేయడం ఎలా ?? యూనివర్సిటీ విద్యార్థులకు శిక్షణ.. వీడియో