హృదయవిదారక ఘటన.. తల్లీ, కుమారుడిని కబళించిన మృత్యువు

ఎక్కడికెళ్లినా ఆ తల్లీకుమారులిద్దరూ కలిసే వెళ్తారు. వారి మధ్య ఉన్న అనురాగం చూసి ఆ విధికి కన్ను కుట్టిందేమో..! రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఇద్దరినీ కబళించింది. పండుగ సంతోషాలతో....

హృదయవిదారక ఘటన.. తల్లీ, కుమారుడిని కబళించిన మృత్యువు
Mother Son Death
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 19, 2022 | 6:35 AM

ఎక్కడికెళ్లినా ఆ తల్లీకుమారులిద్దరూ కలిసే వెళ్తారు. వారి మధ్య ఉన్న అనురాగం చూసి ఆ విధికి కన్ను కుట్టిందేమో..! రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఇద్దరినీ కబళించింది. పండుగ సంతోషాలతో ఇంటికి బయల్దేరిన ఆ తల్లీ కుమారులు.. కల్వర్టులో పడి మృతి(Death) చెందడం అందరినీ కలచివేసింది. తల్లీ, తమ్ముడు మృతదేహాలను చూసి కుమార్తెలు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. శ్రీకాకుళం(Srikakulam) జిల్లా పెద్దపాడు గ్రామానికి చెందిన రమణమ్మ సోదరి జలుమూరు మండలంలోని అచ్యుతాపురంలో నివాసముంటోంది. సోదరి ఇంట్లో పండుగ జరగడంతో కుమారుడు మణికంఠతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లారు. పండగ రోజంతా బంధువులతో సంతోషంగా గడిపారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడి నుంచి బయల్దేరారు. సారవకోట మండలం బుడితి కూడలి సమీపానికి వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం వచ్చేసరికి.. నిర్మాణంలో ఉన్న కల్వర్టును గుర్తించక ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. ఈ ఘటనలో తల్లీకుమారులిద్దరూ మృతి చెందారు.

రమణమ్మ భర్త అప్పారావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే రెండు నిండు ప్రాణాలు బలయ్యాయని మృతుల బంధువులు ఆరోపించారు. మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు యత్నించగా వారిని అడ్డుకున్నారు. చివరికి పోలీసుల సమన్వయంతో గొడవ సద్దుమణిగింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అప్పారావు, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. మూడో సంతానంగా కుమారుడు పుట్టడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఎక్కడికెళ్లినా తల్లీకొడుకు కలిసే వెళ్లేవారు.

తమను చూసుకుంటాడనుకున్న బిడ్డ ఇలా వదిలి వెళ్లిపోయాడని తండ్రి అప్పారావు కంటతడి పెట్టారు. తల్లీ, తమ్ముడు మృతదేహాలను చూసి కుమార్తెలు రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. మణికంఠ ఇంటరు చదువుతుండగా, రమణమ్మ పెద్దపాడు సమీపంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు.

Also Read

Indian Railways: రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. ఇక ఏ స్టేషన్‌ నుంచైనా ట్రైన్ ఎక్కొచ్చు..

Ukraine-Russia: రష్యా-ఉక్రెయిన్‌ యుద్దానికి కౌంట్‌డౌన్‌.. వరుసగా మూడోరోజు బలగాలు ఆయుధ మోహరింపు

8 వారాలు నిద్రపోతే 1.5 లక్షల జీతం !! ఎవరికి అవకాశం ఉందంటే ?? వీడియో

ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్