AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. ఇక ఏ స్టేషన్‌ నుంచైనా ట్రైన్ ఎక్కొచ్చు..

IRCTC Rules: కొన్నిసార్లు రైలు టిక్కెట్‌ను బుక్ చేసిన తర్వాత, బోర్డింగ్ స్టేషన్‌ను మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. IRCTC నూతన రూల్స్‌తో మీ సమస్యను సులభతరం చేస్తుంది.

Indian Railways: రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. ఇక ఏ స్టేషన్‌ నుంచైనా ట్రైన్ ఎక్కొచ్చు..
Irctc
Venkata Chari
|

Updated on: Feb 19, 2022 | 6:24 AM

Share

Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త. బోర్డింగ్ స్టేషన్‌ నుంచి కాకుండా ప్రస్తుతం ఏ స్టేషన్ నుంచైనా ట్రైన్ ఎక్కొచ్చు. ఈ మేరకు భారతీయ రైల్వేలు(IRCTC) రూల్స్ మార్చాయి. బుక్ చేసుకున్న రైల్వే స్టేషన్‌కు బదులుగా ఏదైనా ఇతర స్టేషన్ నుంచి రైలు ఎక్కడంలో మీకు ఎలాంటి జరిమానా పడదు. కానీ, బోర్డింగ్ స్టేషన్‌ను మార్చడానికి, మీరు మీ టిక్కెట్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు జరిమానా విధించే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు అకస్మాత్తుగా బోర్డింగ్ స్టేషన్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు, బోర్డింగ్ స్టేషన్‌ దూరంలో ఉండడంతో ప్రయాణీకులు చేరుకోవడానికి ఇబ్బందులు ఉండొచ్చు. దీంతో రైలు(Train) తప్పిపోతుందనే భయం కూడా ఉంది.

అందువల్ల, రైలు ప్రయాణీకుల చేరుకోవడానికి దగ్గరగా ఉన్న స్టేషన్‌లో ఆగినట్లయితే, అప్పుడు ప్రయాణీకుడు తన బోర్డింగ్ స్టేషన్‌ను సవరించవచ్చు. లేదంటే కొన్నిసార్లు వేరే పరిస్థితుల్లో బోర్డింగ్‌ మార్చుకోవాల్సి వస్తుంది. ప్రయాణీకుల ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, IRCTC బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే సౌకర్యాన్ని అందిస్తుంది. IRCTC ఈ సదుపాయం ట్రావెల్ ఏజెంట్ల ద్వారా లేదా ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా కాకుండా ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ అందించింది. ఇది కాకుండా, VIKALP బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికుల PNRలలో బోర్డింగ్ స్టేషన్‌ను మార్పు చేయడం మాత్రం సాధ్యం కాదు.

రైలు బయలుదేరిన 24 గంటల్లోగా.. తన బోర్డింగ్ స్టేషన్‌ని మార్చాలనుకునే ప్రయాణీకుడు రైలు బయలుదేరే 24 గంటల ముందు ఆన్‌లైన్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రయాణీకులకు IRCTC అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ప్రయాణీకుడు తన బోర్డింగ్ స్టేషన్‌ను మార్చిన తర్వాత, అసలు బోర్డింగ్ స్టేషన్ నుంచి రైలు ఎక్కడం కుదరదు.

ప్రయాణీకుడు బోర్డింగ్ స్టేషన్‌ను మార్చకుండా మరొక స్టేషన్ నుంచి రైలు ఎక్కితే, అతను జరిమానాతో పాటు బోర్డింగ్ పాయింట్, సవరించిన బోర్డింగ్ పాయింట్ మధ్య ఛార్జీల వ్యత్యాసాన్ని చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. IRCTC నియమాల ప్రకారం- బోర్డింగ్ స్టేషన్‌లో మార్పు ఒక్కసారి మాత్రమే చేసుకునేందుకువీలుంది. కాబట్టి మీరు మార్పులు చేసే ముందు పక్కగా అన్ని నిర్ధారించుకుని చేయాల్సి ఉంటుంది.

బోర్డింగ్ స్టేషన్‌ను మార్చేందుకు ఇలా చేయండి..

1. ముందుగా మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్ https://www.irctc.co.in/nget/train-searchకి వెళ్లండి.

2. లాగిన్ చేసి, ఆపై ‘బుకింగ్ టిక్కెట్ హిస్టరి’కి వెళ్లండి.

3. మీ రైలును ఎంచుకుని, ‘ఛేంజ్ బోర్డింగ్ పాయింట్’ఆఫ్షన్‌కు వెళ్లండి.

4. ఇక్కడ డ్రాప్ డౌన్‌లో మీరు ఎంచుకున్న రైలు కోసం కొత్త బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవాలి.

5. కొత్త స్టేషన్‌ని ఎంచుకున్న తర్వాత, సిస్టమ్ నిర్ధారణ కోసం అడుగుతుంది. ఇప్పుడు మీరు ‘ఓకే’పై క్లిక్ చేయండి.

6. బోర్డింగ్ స్టేషన్‌ని మార్చినట్లుగా మీ మొబైల్‌కు ఓ ఎస్‌ఎంఎస్‌ అందుకుంటారు.

Also Read: Maharashtra: మహారాష్ట్రలో మారుతున్న రాజకీయం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం.. సవాల్‌గా స్పీకర్ ఎన్నిక!

Rivers Link: గోదావరి -కావేరీ నదుల అనుసంధానికి ముందడుగు.. రాష్ట్రాల సూచనల మేరకే ప్రాజెక్టు డిజైన్లుః కేంద్రం