AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ఓరివీడి వేషాలో.. ట్రైన్‌లో సీటు సంపాదించడం కోసం ఏం చేశాడో చూడండి..

కొంత మంది చేసే పనులు ఒకొక్కసారి చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి. కొంత మంది చేసే విచిత్రమైన చేష్టలు కొన్ని సార్లు నవ్వులు పూయిస్తూఉంటాయి

Funny Video: ఓరివీడి వేషాలో.. ట్రైన్‌లో సీటు సంపాదించడం కోసం ఏం చేశాడో చూడండి..
Funny Video
Rajeev Rayala
|

Updated on: Feb 18, 2022 | 8:34 PM

Share

Funny Video: కొంత మంది చేసే పనులు ఒకొక్కసారి చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి. కొంత మంది చేసే విచిత్రమైన చేష్టలు కొన్ని సార్లు నవ్వులు పూయిస్తూఉంటాయి. మెట్రో రైలు నేడు మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మెట్రో రైలులో ప్రయాణించని వారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు ఈ మధ్య. ఎక్కువ మంది మెట్రో రైలు ప్రయాణం చేయడంతో  రద్దీ  కూడా పెరిగిపోయింది. అయితే ఒక్కటి ప్రాబ్లమ్.. ప్రయాణించే సమయంలో మాత్రం కచ్చితంగా సీటు కావాలి. అప్పుడే రైలు ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. రైలు ఎక్కే ప్రయాణికులు ముందుగా సీటు ఎక్కడ ఖాళీగా ఉందో చూస్తారు. మీరు సీటు పొందిన తర్వాత, మీరు వెనుకకు వంగి హాయిగా నిద్రపోవచ్చు లేదా చుట్టూ చూసి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు కానీ..మెట్రో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు సీటుదొరక్క పోతే చాలా కష్టం ఈ విషయం అందరికీ తెలిసిందే..  అయితే ఈ వ్యక్తి సీటు కోసం చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ప్రయాణికులతో నిండిపోయిన మెట్రో రైలులో సీటు దొరక్క ఆ యువకుడి పన్నాగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు. మెట్రో ప్రయాణికులతో నిండిన కోచ్‌లోకి ఓ యువకుడు ఎక్కాడు. తలుపు దగ్గర నిలబడి. ఎలాగైనా సీటు సంపాదించాలని ఆ యువకుడు అనుకున్నాడు. అది అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కసారిగా ఆరోగ్యం బాగోలేదని వాంతులు చేసుకుంటున్నట్లు నటించడం మొదలుపెట్టాడు. ఇది చూసి రెండు వరుసలలో ఉన్నవారు సీట్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. క్షణాల్లోనే జనం లేచి పరుగులు తీశారు. దాంతో ఆ యువకుడు ఏమీ పట్టనట్టు ఖాళీ సీటులో హాయిగా కూర్చుని మొబైల్ వైపు చూడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఫన్నీ వీడియో పై మీరు ఓ లుక్కేయండి

View this post on Instagram

A post shared by hepgul5 ?? (@hepgul5)

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral Photo: బోసి నవ్వులు.. చక్కనైన చెక్కిళ్లు.. ఈ క్యూట్ బుజ్జాయి ఎవరో చెప్పండి? అబ్బాయిల డ్రీమ్ గర్ల్!

Son Of India Review: చెడును స‌హించ‌ని స‌న్నాఫ్ ఇండియా.. తగ్గని డైలాగ్ కింగ్ ఎనర్జీ..

Anupama Parameswaran: అందాల ముద్దుగుమ్మ సీతాకోక చిలుకగా మారితే.. ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ న్యూలుక్..