Son Of India Review: చెడును సహించని సన్నాఫ్ ఇండియా.. తగ్గని డైలాగ్ కింగ్ ఎనర్జీ..
వెండి తెరమీద విలక్షణ నటనకు కేరాఫ్ మంచు మోహన్‌బాబు (Mohan Babu). ఎలాంటి పాత్రనైనా హుందాగా ప్రదర్శించే నటన ఆయన సొంతం.
వెండి తెరమీద విలక్షణ నటనకు కేరాఫ్ మంచు మోహన్‌బాబు (Mohan Babu). ఎలాంటి పాత్రనైనా హుందాగా ప్రదర్శించే నటన ఆయన సొంతం. ఆకాశమే నీ హద్దురా లాంటి సినిమాల్లో అరుదుగా కనిపిస్తున్నారే తప్ప, పూర్తి స్థాయి సినిమాలు చేసి కొన్నేళ్లయింది. గాయత్రి తర్వాత ఆయన చేసిన పూర్తి స్థాయి సినిమా సన్నాఫ్ ఇండియా (Son Of India).
సినిమా: సన్నాఫ్ ఇండియా
నిర్మాణ సంస్థలు: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
నటీనటులు: మోహన్‌బాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైశ్వాల్, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిశోర్, పృథ్విరాజ్, రఘుబాబు, రాజా రవీంద్ర, రవి ప్రకాష్, బండ్ల గణేష్, మీనా తదితరులు
సంగీతం: ఇళయరాజా
కెమెరా: సర్వేష్ మురారి
ఎడిటింగ్: గౌతమ్ రాజు
దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
మాటలు: సాయినాథ్ తోటపల్లి, డైమండ్ రత్నబాబు
స్క్రీన్‌ప్లే: మంచు మోహన్‌బాబు
నిర్మాత: విష్ణు మంచు
విడుదల: ఫిబ్రవరి 18, 2022
విరూపాక్ష అలియాస్ బాబ్జీ (మంచు మోహన్‌బాబు) ఎన్ ఎ ఐ ఆఫీస్‌లో టెంపరరీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో సెంట్రల్ మినిస్టర్ (శ్రీకాంత్), ఓ డాక్టర్, మరో దేవాదాయశాఖ మంత్రి ( రాజా రవీంద్ర) కిడ్నాప్‌కి గురవుతారు. ఎన్ ఐ ఏ ఆఫీసర్ ఐరా (ప్రగ్యా జైశ్వాల్) తన టీమ్ (మంగ్లీ, పృథ్వి)తో కలిసి ఆ కేసును ఛేదిస్తుంటుంది. తీరా ఈ కిడ్నాప్‌లన్నీ చేసింది బాబ్జీ అని తెలుసుకుంటారు. సాధారణ డ్రైవర్‌కి అంత పెద్ద వారిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? సగటు మానవుడు అన్ని పనులు ఒక్కడే ఎలా చేయగలిగాడు? అతనికి సపోర్ట్ చేసిన వారెవరు? అసలు విరూపాక్ష బాబ్జీగా ఎందుకు మారారు? హోమ్ మంత్రి అంతటివాడు విరూపాక్షకు ఎందుకు నమస్కారం చేశాడు? అసలు అతని కథ ఏంటి? చివరికి జైళ్ల గురించి విరూపాక్ష చెప్పిందేంటి? వంటి అంశాలన్నీ ఆసక్తికరం.
దాదాపు నాలుగేళ్ల తర్వాత మోహన్‌బాబు చేసిన పూర్తి స్థాయి సినిమా ఇది. అయినా ఎక్కడా ఛార్మ్ తగ్గలేదు. స్క్రీన్ మీద మరింత ఎనర్జీతో కనిపించారు మోహన్‌బాబు. ఇప్పటికీ కొన్ని డైలాగులు ఆయన మాత్రమే చెప్పగలరనే మాటను మరోసారి నిరూపించారు. మోహన్‌బాబు లుక్ డిజైనింగ్, విరానికా మంచు చేసిన స్టైలింగ్ బావున్నాయి. చిరంజీవి వాయిస్ ఓవర్‌తో సినిమా మొదలవుతుంది. విరూపాక్ష కేరక్టర్ గురించి చిరంజీవి ఇచ్చిన ఇంట్రడక్షన్, కథను నడపడానికి మధ్యమధ్యలో ఆయన చెప్పిన మాటలు బావున్నాయి. ఇళయరాజా మ్యూజిక్ పవర్ టైటిల్స్ పడేటప్పటి నుంచే కనిపిస్తుంది. టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు డైరక్టర్ చూపించిన క్రియేటివిటీ బావుంది.
తొలి పాటను యానిమేషన్‌తో జోడించి చిత్రీకరించిన తీరు బావుంది. కులాల గురించి, సమసమాజంలో అందుబాటులో ఉండాల్సిన న్యాయం గురించి, తప్పుడు కేసులతో జైలులో శిక్షలు అనుభవిస్తున్న నిరపరాధుల గురించి, ప్రైవేటు జైళ్ల గురించి ప్రస్తావించిన తీరు బావుంది. మోహన్‌బాబు, టీవీలో యాంకర్లు తప్ప మరే ఇతర కేరక్టర్ల ముఖాలు స్క్రీన్ మీద కనిపించకుండా, కేవలం వాళ్ల గొంతులతో కథ నడపడం ప్రయోగమే.
సొసైటీలో గౌరవంగా జీవితాన్ని గడిపే వ్యక్తికి అన్యాయం జరగడం, దానికి అతను ప్రతీకారం తీర్చుకోవడం అనేది అందరూ ఊహించదగ్గ కాన్సెప్టే. టైటిల్‌ని బట్టే అర్థమయ్యే కాన్సెప్ట్ సన్నాఫ్ ఇండియా. చెడుని సహించని వ్యక్తి కథ. – డా. చల్లా భాగ్యలక్ష్మి
Also Read: Kalaavathi Song: సూపర్బ్.. అదిరిపోయిన కళావతి సాంగ్ మేకింగ్ వీడియో.. నెట్టింట్లో ట్రెండింగ్..
Samantha: పూజా హెగ్డే ఛాలెంజ్‌కు సమంత కౌంటర్.. లేట్ అయితే ఇలాగే ఉంటుందంటూ..
Viral Video: ద్యావుడా.. ఇదెక్కడి టెస్ట్ రా బాబు.. టెస్టీ ఫుడ్‌ను ఎలా చేశారో చూడండి..