Shiva Kandukuri: ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంది కదా అని ఏది బడితే అది చేయకూడదు.. యంగ్ హీరో కామెంట్స్ వైరల్..

గమనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు యంగ్ హీరో శివ కందుకూరి (Shiva Kandukuri). ఇంజనీరింగ్ పూర్తి చేసి న‌ట‌న‌పై ఆస‌క్తితో సినిమారంగంలోకి అడుగుపెట్టాడు

Shiva Kandukuri: ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంది కదా అని ఏది బడితే అది చేయకూడదు.. యంగ్ హీరో కామెంట్స్ వైరల్..
Shiva
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 18, 2022 | 9:09 AM

గమనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు యంగ్ హీరో శివ కందుకూరి (Shiva Kandukuri). ఇంజనీరింగ్ పూర్తి చేసి న‌ట‌న‌పై ఆస‌క్తితో సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. 2020లో `చూసి చూడంగానే` సినిమా ద్వారా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శివకు ఇటీవల వచ్చిన గ‌మ‌నం సినిమా గుర్తింపునిచ్చింది. అందులో చారుహాస‌న్‌, శ్రియా శ‌ర‌ణ్ వంటి న‌టీన‌టుల‌నుంచి ఎంతో నేర్చుకున్నాననీ తెలిపారు శివ. `పెళ్లి చూపులు’ ఫేమ్ రాజ్ కందుకూరి కుమారుడిగా నేప‌థ్యం వున్నా క‌ష్ట‌ప‌డి తానేంటో నిరూపించుకుకోవాల‌నేదే త‌న కోరిక‌ని తెలియ‌జేశాడు. శుక్ర‌వారం ఫిబ్ర‌వ‌రి 18న శివ కందుకూరి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా గురువారంనాడు మీడియాలో ప‌లు విష‌యాలను తెలియ‌జేశారు.

– సినిమా చేయాలంటే క‌థ‌, కేరెక్ట‌ర్‌లో ప‌ర్‌ప‌స్ వుండేలా చూస్తాను. అలాగే అలాగే క‌థ‌ల‌ను ఎంపిక చేసుకున్నా. `గ‌మ‌నం` అలా చేసిందే. ఆ సినిమా ఓటీటీలో విడుద‌లై అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రేక్ష‌కులు ఆద‌రించారు. దాన్ని బ‌ట్టి నేను ఎంచుకున్న విధానం క‌రెక్ట్ అనిపించింది.

– నేను కమర్షియల్ సబ్జెక్ట్‌లను మాత్రమే ఎంచుకోవాలని కాదు. దాని నుంచి బ‌ట‌య‌కు వ‌చ్చి అర్థ‌వంతమైన సినిమాలే చేయాలన్నది నా నమ్మకం. నేను నా నమ్మకాలకు వ్యతిరేకంగా వెళ్లలేను.

– కనీసం నా కెరీర్ తొలిదశలో అయినా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు చేసినా ఆర్గానిక్ సినిమాలే చేస్తాను. ‘మను చరిత్ర’ ఆర్గానిక్‌గా ఉండబోతోంది. క్యారెక్టర్ జర్నీ, స్టోరీ రియలిస్టిక్ గా ఉంటుంది.

– నేను ఏ పాత్ర చేసినా పాత్రకు కనెక్ట్ అవ్వాలి. స్క్రిప్ట్‌లో నాకు నమ్మకం ఉండాలి. అల్లు అర్జున్ గారు పుష్ప‌లోని క్యారెక్టర్‌ని నమ్మారు కాబట్టి ‘పుష్ప’ మెప్పించింది. ఆ స్థాయి నమ్మకం లేకుంటే ప్రేక్షకులు ఇంతగా ఆదరించి ఉండేవారు కాదు. ఇది అన్ని రకాల సినిమాలకూ వర్తిస్తుంది.

– ఏదో ఫ్యామిలీ బేక్‌గ్రౌండ్ వుంది కదాని ఏది బ‌డితే అది చేయ‌కూడ‌దు. ప్రేక్ష‌కులు మ‌న‌ల్ని నిశితంగా గ‌మ‌నిస్తూనేవుంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీ వ‌చ్చాక స్పానిష్‌తోపాటు ప‌లు దేశాల సినిమాల‌ను చూసి ఎన‌లైజ్ చేస్తున్నారు. అందుకే న‌టులుగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

– వచ్చే ఐదేళ్లలో నేను కొన్ని సినిమాలు మాత్రమే చేయగలను. వాల్యూమ్ పట్టింపు లేదు. మా నాన్న సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నారు. సినిమా చేయాలా వద్దా అనే నిర్ణయం నాపై ఆధారపడి ఉంటుంది. నాన్న‌గారు కేవలం ఏదైనా స‌జెన్స్‌ మాత్రమే ఇస్తాడు. చాలా సార్లు నా అభిప్రాయాలకే పెద్ద పీట వేస్తారు.

– కెరీర్ మొద‌టిలోనే `గ‌మ‌నం` ద్వారా చారు హాసన్ సర్, ఇళ‌య‌రాజా సంగీతం, సినిమాటోగ్రాఫర్ విఎస్ జ్ఞానశేఖర్ వంటి సీనియర్లను గమనించి నేను చాలా నేర్చుకున్నాను. నా రెండో సినిమా ‘గమనం’లో ప్రతిభావంతులైన వారితో కలిసి పని చేశాను. క‌థ విన్న‌ప్పుడే నా గ్రాడ్ ఫాద‌ర్‌తో వున్న ఎటాచ్‌మెంట్‌ చారు హాస‌న్‌తో క‌నెక్ట్ అయింది. న‌ట‌న‌కూ స్కోప్ వున్న చిత్ర‌మ‌ది. డెడికేష‌న్ వారి నుంచి నేర్చుకున్నా.

– ప్ర‌స్తుతం ఇండస్ట్రీలో యూత్ హీరోల‌తో భారీ పోటీ ఉంటుంది. అదీ పాజిటివ్ కోణంలోనే వుంది. ప్ర‌తి ఒక్క‌రూ క‌థాపరంగా విభిన్నంగా ఏదైనా చేయాలని కోరుకుంటారు.

– పెద్ద చిత్రాల‌తో పాటుగా తక్కువ బడ్జెట్‌లతో రూపొందించబడిన చిత్రాలకు OTT ఒక ఫ్లాట్‌ఫార‌మ్‌గా మారింది. అందులో కంటెంట్-ఆధారిత కథనాలను చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంది. కొత్త వారికి ఇది చాలా ఆరోగ్యకరమైన విష‌యం.

– కొత్త సినిమాల‌ప‌రంగా చూస్తే, ‘మను చరిత్ర’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. క్రైమ్ థ్రిల్లర్ కూడా చేస్తున్నాను. నూతన దర్శకుడు పురుషోత్తం రాజ్ దీనికి దర్శకుడు. నేచురల్ స్టార్ నాని గారు నిర్మిస్తున్న ‘మీట్ క్యూట్ వెబ్ ఫిలింలో చేస్తున్నాను. మ‌రో వెబ్ సిరీస్ కూడా చ‌ర్చ‌ల్లో వుంది. ఓటీటీ అనేది పేండ‌మిక్ త‌ర్వాత ప్రేక్ష‌కుల‌కు మంచి వినోద సాధ‌నంగా మారిపోయింది. ఏదైనా థియేట‌ర్‌ను బీట్ చేయ‌లేదు.

– నా బ‌ర్ద్ డే రిజ‌ల్యూష‌న్ పెద్ద‌గా లేవు. ఆర్గానిక్ స్టోరీలు చెప్పాల‌నుకుంటున్నాను. క‌రోనా అనే గేప్ కూడా క‌థ‌లు ఎంచుకునేవిధానంలో మార్పును ప్ర‌తి ఆర్టిస్టులో క‌ల‌గ‌జేసిందని చెప్ప‌గ‌ల‌ను. మను చ‌రిత్ర అనే సినిమా రెండు నెల‌లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నామ‌ని తెలిపారు.

Also Read: Samantha: పూజా హెగ్డే ఛాలెంజ్‏కు సమంత కౌంటర్.. లేట్ అయితే ఇలాగే ఉంటుందంటూ..

Health Tips: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా ? అయితే ప్రమాదమే అంటున్న నిపుణులు..

Amala Paul: అమలా పాల్‌ కండిషన్‌కు అదిరిపడ్డ నిర్మాతలు.. మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ..

Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్న మహేష్ బాబు
సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్న మహేష్ బాబు
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?