Health Tips: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా ? అయితే ప్రమాదమే అంటున్న నిపుణులు..

ప్రస్తుతం చాలా మందికి మొబైల్‏కు వ్యసనపరులుగా మారిపోయారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి.. అర్థరాత్రి వరకు గంటల తరబడి ఫోన్‏లో మునిగిపోతున్నారు.

Health Tips: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా ? అయితే ప్రమాదమే అంటున్న నిపుణులు..
Phone
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 18, 2022 | 7:51 AM

ప్రస్తుతం చాలా మందికి మొబైల్‏కు వ్యసనపరులుగా మారిపోయారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి.. అర్థరాత్రి వరకు గంటల తరబడి ఫోన్‏లో మునిగిపోతున్నారు. ఇక సోషల్ మీడియా ప్రపంచం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం లేవగానే.. టైం చూసుకోవడంతో మొదలు.. ఈమెయిల్ చెకింగ్స్, వాట్సాప్ మేసేజ్‏లు చెక్ చేసుకోవడం.. ఇలా ఒక్కటేమిటీ కనీసం అర్థ గంటపాటు ఫోన్‏లో గడిపేస్తారు. ఇక కొందరికి ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా అస్సలు ఉండలేరు. కేవలం యూత్ మాత్రమే కాదండోయ్.. పెద్ద, చిన్నా అనే సంబంధం లేకుండా ఫోన్‏లో గంటలు గంటలు మునిగిపోతున్నారు. కానీ ఇలా లేవగానే ఫోన్ చూడడం అస్సలు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ ఎక్కువగా వాడడం వలన అనేక రకాల రోగాల బారిన పడే అవకాశం ఉందట.

ప్రస్తుతం దాదాపు 61 శాతం మంది ప్రజలు నిద్రవేళకు ముందు, నిద్రలేచిన తర్వాత కొన్ని నిమిషాలు ఫోన్‏లో గడిపేస్తారని ఓ అధ్యాయనంలో తేలీంది. కానీ ఫోన్ ఎల్ఈడీ ప్రకాశవంతమైన నీలం కాంతిని కలిగి ఉంటుంది. ఇది నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. అలాగే రాత్రి పడుకునే ముందు చాలా మంది ఫోన్ చూస్తుంటారు. ఫలితంగా నిద్ర తొందరగా పట్టదు. చాలా సేపు మెరుపు మీ కళ్ల ముందు చాలా సేపు ఉంటుంది. మీకు నిద్ర పట్టదు.

ఉదయం లేవగానే ఫోన్ చూస్తే మానసిక క్షోభ కలుగుతుంది. ఆందోళన, నిద్రలేమి, మెడ నొప్పి, చేతి నొప్పులు వంటి సమస్యలు అధికమవుతాయి. అందుకే నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత ఫోన్ చూసే అలవాటు మానుకోవాలి. అలాగే లేవగానే ఫోన్ చూడడం వలన ఏకాగ్రత లేకపోవడం.. తల బరువుగా అనిపించడం.. సరిగ్గా ఆలోచించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా.. తీవ్రమైన తలనొప్పి తగ్గుతుంది.

ఇటీవల జరిగిన అధ్యాయనాల ప్రకారం ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూడడం వలన అధిక రక్తపోటు సమస్య వేధిస్తుందని.. ఈ లైటింగ్ వలన ఒత్తిడి పెరుగుతుందని.. క్రమంగా రక్తపోటు సమస్యకు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రాత్రి సమయంలో ఎక్కువగా ఫోన్ చూడడం వలన నిద్రలేమి సమస్య అటాక్ చేస్తుంది. అంతేకాకుండా.. ఉదయాన్నే తలనొప్పి రావడం.. ఒత్తిడిగా అనిపించడం జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడడం, సరిగ్గా ఆలోచించకపోవడం.. కోపగించుకోవడం..శ్రద్ద చూపకపోవడం వంటి సమస్యలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు.

గమనిక :- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు.. అధ్యాయనాలు, ఇతర నివేదికల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.

Also Read: Bheemla Nayak OTT: భీమ్లానాయక్ సినిమాపై కీలక అప్‌డేట్.. భారీ ధరకు ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్

ఎప్పుడంటే?

Amala Paul: అమలా పాల్‌ కండిషన్‌కు అదిరిపడ్డ నిర్మాతలు.. మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ..

Kajol: ముంబైలో రెండు ఖరీదైన బంగ్లాలు కొన్న కాజోల్‌.. ధర ఎంతో తెలుసా?

Aishwarya Rajinikanth: విడాకుల తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఐశ్వర్య రజినీకాంత్‌.. ఏమన్నారంటే..