Diabetes: మధుమేహంతో బాధపడుతున్నారా.. బెండకాయను ఇలా తీసుకోండి.. బెస్ట్ రిజల్ట్స్‌ పక్కా..

Lady Finger For Diabetes: ఈ కూరగాయ చాలా సంవత్సరాలుగా రక్తంలో చక్కెరను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిసిందే. ఇది అనేక ప్రయోగాల్లో తేలిన విషయమే.

Diabetes: మధుమేహంతో బాధపడుతున్నారా.. బెండకాయను ఇలా తీసుకోండి.. బెస్ట్ రిజల్ట్స్‌ పక్కా..
Okra For Diabetes
Follow us
Venkata Chari

|

Updated on: Feb 18, 2022 | 8:15 AM

Lady Finger For Diabetes: చాలా సంవత్సరాలుగా బెండకాయ(Lady Finger) రక్తంలో చక్కెరను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిసిందే. ఇది అనేక ప్రయోగాల్లో తేలిన విషయమే. దీనికి చాలా పేర్లతో పిలుస్తుంటారు. బిండి, లేడీ ఫింగర్ అని కూడా పిలుస్తుంటారు. దీనిని బహుశా దేశంలేనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తినే కూరగాయగా ప్రసిద్ధి చెందింది. రక్తంలో చక్కెర నియంత్రణ కోసం టర్కీ, తూర్పు మధ్యధరా నాగరికతలలో బెండకాయను ఉపయోగిస్తున్నారు. ఓక్రాలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో కూడిన చాలా పోషకాలు ఉన్నాయి. ఇందులో పోషకాలు అనేకం ఉన్నాయి. అయితే కేలరీలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. మధుమేహం(Diabetes) అనేది ప్రస్తుతం చాలామందిలో కనిపిస్తుంది. అయితే మంచి జీవనశైలి రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.

సమతుల్య ఆహారం, చురుకైన జీవనశైలి, మంచి విశ్రాంతితోపాటు రక్తంలో చక్కెరను నియంత్రించడం, ఇతర అవయవాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడే కొన్ని ఆహారాలు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. అలాంటి వాటిలో బెండయాక కూడా ఉంటుంది. బెండకాయలతోపాటు దాని గింజలు రక్తంలో చక్కెరలను నియంత్రించడానికి ఇన్ఫ్యూషన్‌గా ఉపయోగపడతాయి. అయితే దీనిని పొడిగా చేసుకుని కూడా వాడితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

బెండకాయలో కరిగే, కరగని ఫైబర్‌లకు మూలంగా ఉంది. ఇది రక్తంలో చక్కెరలను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. భోజనం చేశాక కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తాయి. జీర్ణక్రియను ఆలస్యం చేస్తాయి. ఇది భోజనం తర్వాత వచ్చే చిక్కులు, ఆకలి బాధలను నివారిస్తుంది.

ఓక్రాలో ఫ్లేవనాయిడ్స్ లేదా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు చక్కెర నియంత్రణలో చురుకుగా పనిచేస్తాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది. ఇందులో అత్యంత సాధారణ సమ్మేళనం మైరిసెటిన్ ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, కొలెస్ట్రాల్ వంటి ఇతర వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది. చక్కెర నియంత్రణపై సానుకూల ప్రభావాన్ని చూపే మరో మూడు సమ్మేళనాలు అంటే ఒలినోలిక్ యాసిడ్, బీటా సిస్టోస్టెనాల్, మైరిసెటిన్, కెంప్ఫెరోల్ ఉన్నాయి. బెండకాయలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌ కూడా ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెరలను నియంత్రించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది.

డయాబెటిస్ డైట్ కోసం బెండకాయ.. రక్తంలో చక్కెరలను నియంత్రించడానికి బెండకాయను వాడతారని తెలిసిందే. అయితే దీనిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బెండకాయను వారానికి మూడుసార్లు తీసుకోవడం వల్ల సానుకూల ప్రభావం ఉంటుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. బెండకాయను ఎండబెట్టి పొడి చేసి వాడుకోవచ్చు. బెండకాయ వాటర్‌ను కూడా ఇందుకోసం వాడుకోవచ్చు. బెండకాయ వాటర్ సూపర్ డ్రింక్ హోదాను పొందిందనడంలో సందేహం లేదు.

బెండకాయ వాటర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందుకోసం 3 నుంచి 5 బెండకాయలను తీసుకోండి. తల, తోకను కత్తిరించండి. పై నుంచి కిందికి చీలికలా చేయాలి. వీటిని 2 గ్లాసుల నీటిలో రాత్రిపూట నానబెట్టండి. ఉదయం ఈ నానబెట్టిన గింజలను గుజ్జు లేదా పిండిలా చేయాలి.

ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవాలి. ఇలా తీసుకోవడంతో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది.

అయితే బెండకాయ కొంతమందికి పడదు. అంటే దీనిని తింటే అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి బాధలు ఉంటే మాత్రం బెండను పక్క పెట్టాల్సిందే.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులను కేవలం సూచనలుగా మాత్రమే పరిగణించండి. ఇటువంటి చిట్కాలు పాటించే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచింది.

Also Read: Soursop: క్యాన్సర్‌కు దివ్య ఔషధం ఆ పండు, ఆ ఆకులు.. కీమో థెరపీ కంటే మేలు చేస్తుంది.. ఈ చెట్లు పెంచమంటున్న పరిశోధకులు

Healthy Food: వయసు పెరిగినా తరగని అందం మీ సొంతమవ్వాలంటే.. ఇలా చేయండి..