AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soursop: క్యాన్సర్‌కు దివ్య ఔషధం ఆ పండు, ఆ ఆకులు.. కీమో థెరపీ కంటే మేలు చేస్తుంది.. ఈ చెట్లు పెంచమంటున్న పరిశోధకులు

Soursop Benefits: లక్షణ ఫలం పైకి చూడడానికి కొంచెం పనస పండు(Jack Fruit)లా, కట్ చేసి లోపల చూస్తే సీతాఫలం(Custard Apple)గా కనిపిస్తుంది. ఈ లక్షణ ఫలం  మన దేశంతోపాటు బ్రెజిల్‌, అమెరికా వంటి..

Soursop: క్యాన్సర్‌కు దివ్య ఔషధం ఆ పండు, ఆ ఆకులు.. కీమో థెరపీ కంటే మేలు చేస్తుంది.. ఈ చెట్లు పెంచమంటున్న పరిశోధకులు
Soursop Hailed As A Cancer
Surya Kala
|

Updated on: Feb 17, 2022 | 5:14 PM

Share

Soursop Benefits: లక్షణ ఫలం పైకి చూడడానికి కొంచెం పనస పండు(Jack Fruit)లా, కట్ చేసి లోపల చూస్తే సీతాఫలం(Custard Apple)గా కనిపిస్తుంది. ఈ లక్షణ ఫలం  మన దేశంతోపాటు బ్రెజిల్‌, అమెరికా వంటి అనేక దేశాల్లో ఎక్కువగా పండుతుంది. దీనిని క్యాన్సర్‌ పేషెంట్లకు దివ్య ఔషధంగా పేర్కొంటారు. లక్ష్మణ ఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషక విలువలు అధికంగా ఉంటాయి. టీబీ, క్యాన్సర్‌, ఎయిడ్స్‌ వంటి వ్యాధులు ఉన్నవారికి ఈ పండు మేలు చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. దేశంలోని ప్రముఖ పర్యాటక రాష్ట్రం గోవాలోని మపుసా ఫ్రైడే మార్కెట్‌లో.. ఈ లక్ష్మణ పండ్లను పెట్టుకుని అమ్మడానికి రెడీ అవుతారు. ఎవరైనా వినియోగదారులు ఈ లక్ష్మణ పండు ధర అడిగితే .. ఒక్కోక్కటి   రూ. 800 అని చెబుతారు. అంతేకాదు.. ఒకొక్కసారి ఈ పండును రూ.  2000 వరకు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతారు.

లక్ష్మణ ఫలం చెట్టు అనోనేసి కుటుంబానికి చెందిన చెట్టు. ఈ చెట్టు ఆకులు సీతాఫలం చెట్టు ఆకులవలె కాకుండా నున్నగా ఉంటాయి. లక్ష్మణ చెట్లు గాలిలో తేమ, వర్షపాతం ఎక్కువ ఉండే దట్టమైన అడవుల్లో పెరుగుతాయి.  లక్ష్మణ పండ్లు తినాలంటే.. చెట్లకు పండాల్సిందే. ఇంట్లో కానీ రసాయనాల ద్వారా కానీ ఈ పండ్లు పండవు.  ఈ లక్ష్మణ ఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకనే ఎక్కువుగా ఈ పండుని జ్యూస్ చేసుకుని తింటారు. అమెరికాలో లక్ష్మణ ఫలాల గుజ్జును ఐస్ క్రీములు, పానీయాలు, స్వీట్లు మొదలగువాటిలో వాడతారు.

లక్ష్మణ ఫలంలో ఔషధగుణాలు: 

లక్ష్మణ ఫలంలో 12 రకాల కేన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధగుణాలు ఉన్నట్లు పలు పరిశోధనల ద్వారా తెలిసింది. పెద్ద ప్రేగు కేన్సర్, రొమ్ము కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, శ్వాసకోస కేన్సర్, క్లోమ గ్రంధి కేన్సర్ వంటి ప్రాణాంతక క్యాన్సర్ కు ఈ లక్షణ ఫలం చెట్లు మంచి ఔషధమని చెబుతున్నారు.

* పెద్ద ప్రేగు కేన్సర్ చికిత్సలో వినియోగించే ఖీమో ధెరఫీ కన్నా 10,000 రెట్లు అధికంగా లక్ష్మణ పండు తినడం.. వలన మేలు జరుగుతుందని అంటున్నారు. దీనిలోని ఔషధ గుణాలు కేన్సర్ కణాలను నిర్మూలించగలవని తెలుసుకున్నారు.

* అమెరికాలోని కొందరు వైద్యులు, కేన్సర్ వ్యాధి గ్రస్తులు ప్రస్తుతం ఈ చెట్టు సారంతో ఉత్పత్తి చేసిన ఔషధాలనే వాడుతున్నారు.

*కొలెస్ట్రాల్‌ స్థాయిలు అధికంగా ఉన్నవారు ఈ పండును తినడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

*అమెరికాలోని అమెజాన్ అడవుల్లో నివసించే ఆటవికులు వందల సంవత్సరాలుగా ఈ చెట్టు బెరడును, ఆకులను, వ్రేళ్ళను, పూలతో సహా విత్తనాలను సైతం వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగిస్తున్నారు.

*తమిళనాడు దిందిగుల్ జిల్లాలో కొన్ని తెగలు చర్మవాధికి లక్ష్మణ ఫల ఆకులను ఉపయోగిస్తారు.

*కడుపులో నులిపురుగులు నివారించడానికి, జ్వరం తగ్గాడనికి , తల్లిపాలు పెరగడానికి, జిగట విరేచనాలకు లక్ష్మణ ఫలం  జ్యూస్ ను తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది.

*ఈ చెట్టు ఆకులు,గింజలు, బెరడు కూడా అనేక వ్యాధులను నివారించడానికి వినియోగిస్తారు. తలలో పేలతో ఇబ్బంది పడేవారు గింజల చూర్ణం మంచి సహాయకారి. నిద్రలేమికి, కండరాల సమస్యలకు, అల్ప రక్తపోటు కు వీటి చెట్టు బెరడు, ఆకులు ఉపయోగపడతాయి.

*పువ్వులు,  మొగ్గలు ఆస్తమా, పిల్లికూతలు, దగ్గును నివారిస్తాయి.

*దీనిలో ఉండే ఫైబర్‌  గుణం మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.

*లక్ష్మణ ఫలం చెట్టు బెరడు, పువ్వులు, మొగ్గలు, ఆకులు, పండ్లు ఇలా అన్నిటిలోనూ ఉండే ఔషధ గుణాల గురించి దాదాపు 22 పరిశొధనలు జరిపారు.

కేన్సర్ చికిత్సకు వాడే విధానం: 

కేన్సర్ ఉన్నవారు లక్ష్మణ ఫలం చెట్టు ఆకులను నీడలో పూర్తిగా ఆరబెట్టి కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని గాజు సీసాలో భద్రపరచుకోవాలి.  ప్రతి రోజు 5 గ్రాములు 200 మిల్లీ లీటర్ల నీటిలో వేసి మరిగించి ఒక గ్లాసు అయ్యేవరకూ మరిగించుకోవాలి. తర్వాత ఆ నీటిని వడబోసుకొని త్రాగాలి. ఇలా ఎప్పటికప్పుడు తయారుచేసుకోవాలి. రోజుకు కనీసం 2 లేక 3 సార్లు త్రాగాలి

(Note: ఈ ఆర్టికల్‌లో మేము సాధారణ పాఠకుని ఆసక్తిని అనుసరించి, సలహాతో కూడిన సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా మీ వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది..)

Also Read: వయసు పెరిగినా తరగని అందం మీ సొంతమవ్వాలంటే.. ఇలా చేయండి..