Molar pregnancy: గర్భం ఏర్పడుతుంది కానీ బిడ్డ ఉండదు.. మీకు ‘ముత్యాల గర్భం’ గురించి తెలుసా..?

ముత్యాల గర్భం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..?..లేదంటే మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. గర్భం ఉందంటారు. మరి స్కాన్ లో బిడ్డ కనిపించదు. ఇదో విచిత్రమైన స్థితి.

Molar pregnancy: గర్భం ఏర్పడుతుంది కానీ బిడ్డ ఉండదు.. మీకు 'ముత్యాల గర్భం' గురించి తెలుసా..?
Molar Pregnancy
Follow us

|

Updated on: Feb 17, 2022 | 5:43 PM

Health Tips: ముత్యాల గర్భం అంటే ఎంటో తెలుసా.. అసలు మీరు దీని గురించి ఎప్పుడైనా విన్నారా..?.. లేదంటే మాత్రం ఇది తెలుసుకోవాల్సిన అంశం. మాములుగా గర్భిణీ  అయిన మూడో నెల నుంచి మహిళలకు కడుపు పెరుగుతుంది. అయితే పెరుగుదల సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే.. చాలామంది కడుపులో కవలలు పెరుగుతున్నారు అని భావిస్తారు. ఇలా జరిగితే వెంటనే మీరు డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇలాంటి స్థితిని ముత్యాల గర్బం అంటారు. స్కాన్‌లో గర్బం ఉంటుంది కానీ బిడ్డ ఉండని ప్రత్యేక పరిస్థితినే ముత్యాల గర్భం అంటారు. కడుపు పెరుగుతుంది. వాంతులు అవుతాయి. ప్రెగ్నన్సీ హార్మోన్స్ కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కానీ కడుపులో బేబీ ఉండదు. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజం. మాములుగా  ఒక  పిండం ఏర్పడడానికి ఒక ఆరోగ్యకరమైన స్పెర్మ్ , ఒక ఆరోగ్యకరమైన అండంతో సంయోగం చెందాలి. అలా తండ్రి నుంచి రెండు, తల్లి నుంచి రెండు క్రోమోజోములు బిడ్డకు సంక్రమిస్తాయి.

అయితే ముత్యాల గర్భంలో హెల్దీగా ఉన్న ఒక శుక్రకణం, క్రోమోజోములు లేని ఒక ఖాళీ అండంతో సంయోగం చెంది… తన క్రోమోజోముల్ని సంఖ్యను పెంచుకుంటూ వెళ్తుంది. దీనిలో మరోరకం కూడా ఉంటుంది. రెండు శుక్రకణాలు… ఒక ఖాళీ అండంతో  కలవడం వల్ల ఏర్పడిన పిండంలో కేవలం మగ క్రోమోజోములు మాత్రమే వుంటాయి. అండం యొక్క క్రోమోజోములుండవు. దీన్ని సంపూర్ణమైన ముత్యాల గర్భం అని పేర్కొంటారు. ముత్యాల గర్భం ఏర్పడితే కడుపులో పిండం బిడ్డలా ఎదగదు.. ముత్యాల వంటి బుడగల ఆకారంలో వృద్ధి చెందుతుంది. Beta- HCG అనే హార్మోన్ సాధారణ గర్భంలో కనిపించే స్థాయి కన్నా Molar pregnancy లో మరింత ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా డాక్టర్లు అది ముత్యాల గర్భం అని డిసైడ్ చేస్తారు. పూర్తి  నిర్ధారణ తెలియాలంటే ఆ ముత్యాల వంటి కణాలను బయాప్సీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. అతిగా వేవిళ్లు, నెలలకన్నా మించి పొట్ట పెరగడం అనేవి ఈ ముత్యాల గర్భం ప్రధాన లక్షణాలు అని డాక్టర్లు చెబుతున్నారు. ముత్యాల గర్భాన్ని తీసివేయడానికి ఆపరేషన్ అవసరమవుతుంది. అయితే మత్తు ఇచ్చిన తర్వాత గర్భాశయ ద్వారం నుంచి సక్షన్ ట్యూబ్ ద్వారా ముత్యాల వంటి కణ జాలాన్ని తీసివేస్తారు. కోత, కుట్టూ అవసరం లేదు.

Also Read: Tirumala: ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం.. టీటీడీ సంచలన నిర్ణయం

కారంపొడి, పచ్చి మిర్చి రెండింటిలో ఏది బెటర్.. ఈ విషయాలు మీరు అస్సలు నమ్మలేరు

ప్రమాదంలో టీమిండియా ప్లేయర్ టెస్ట్ కెరీర్..
ప్రమాదంలో టీమిండియా ప్లేయర్ టెస్ట్ కెరీర్..
ఒకే జట్టులో కోహ్లీ, బాబర్.. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో ఆసియా కప్?
ఒకే జట్టులో కోహ్లీ, బాబర్.. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో ఆసియా కప్?
హంతకుడిని పట్టించిన ఈగలు.. ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్..
హంతకుడిని పట్టించిన ఈగలు.. ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్..
ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో
ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో
టాలీవుడ్ పై కన్నేసిన కన్నడ బ్యూటీ.. ఎన్టీఆర్ జోడిగా ఛాన్స్.. !
టాలీవుడ్ పై కన్నేసిన కన్నడ బ్యూటీ.. ఎన్టీఆర్ జోడిగా ఛాన్స్.. !
కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ పులగం.. ఇలా చేశారంటే సూపర్..
కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ పులగం.. ఇలా చేశారంటే సూపర్..
ఓర్నాయనో.. మందు తాగే అలవాటుందా..? మీ కిడ్నీలు గుల్లయినట్లే..
ఓర్నాయనో.. మందు తాగే అలవాటుందా..? మీ కిడ్నీలు గుల్లయినట్లే..
సౌదీ ఎడారిలో హిమపాతం.. చరిత్రలో తొలిసారి..వాతావరణ శాఖ హెచ్చరికలు!
సౌదీ ఎడారిలో హిమపాతం.. చరిత్రలో తొలిసారి..వాతావరణ శాఖ హెచ్చరికలు!
ముంబై టీంను వీడాడు.. కట్‌చేస్తే.. 9 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు
ముంబై టీంను వీడాడు.. కట్‌చేస్తే.. 9 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు
మనిషివేనా నువ్వసలు.. కస్టమర్ పై డెలివరీ బాయ్ చిందులు.. కారణం ఇదే
మనిషివేనా నువ్వసలు.. కస్టమర్ పై డెలివరీ బాయ్ చిందులు.. కారణం ఇదే