Green Chilli: కారంపొడి, పచ్చి మిర్చి రెండింటిలో ఏది బెటర్.. ఈ విషయాలు మీరు అస్సలు నమ్మలేరు
Health Tips: హెల్త్ కంటే టేస్ట్‌కే జనాలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే కాస్త ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు మాత్రం డైలీ వ్యాయామం చేయడంతో పాటు ఆహార అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు.
Health Benefits of Green Chilli: హెల్త్ కంటే టేస్ట్‌కే జనాలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే కాస్త ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు మాత్రం డైలీ వ్యాయామం చేయడంతో పాటు ఆహార అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు. కాగా కూరల్లో కారంపొడి వేస్తే మంచిదా..? పచ్చి మిరపకాయల్ని వేస్తే మంచిదా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే పచ్చి మిర్చి రెగ్యులర్‌గా దొరకవు కాబట్టి ఎక్కుమంది కారం వైపే మొగ్గు చూపుతారు. అయితే ఆరోగ్య పరంగా చూస్తే.. పచ్చిమిరపకాయలే మేలని డైటీషియన్లు చెబుతున్నారు. పచ్చిమిర్చి షుగర్(Diabetes) వ్యాధిగ్రస్తులకు మంచి చేయడంతో పాటు.. క్యాన్సర్(Cancer)ను అడ్డుకోవడంలోనూ సహాయపడుతుందట. ఇక శరీరం ప్రకాశంవంతగానూ ఉండేలా సాయపడుతుందట. మిర్చిని వాడడం వల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. రక్త హీనత సమస్య కూడా దరిచేరదు. పచ్చి మిర్చిలో ఐరన్, ఫాస్పరస్, విటమిన్ బి6 మెండుగా ఉంటాయి. రక్త ప్రసరణ మంచిగా జరిగేందుకు ఇవి అవసరం. ఇక పచ్చి మిర్చి కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా సాయపడుతుందట. అజీర్తి సమస్యలు ఉన్నవారు పచ్చిమిరపకాయలు వేసిన ఆహారాన్ని అధికంగా తీసుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండెకు కూడా పచ్చిమిరపకాయలు చాలా మేలు చేస్తాయట. రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను ఇవి తగ్గిస్తాయని చెబుతున్నారు. డయాబెటిస్ రోగులు రోజూ ఆహారంలో పచ్చిమిరపకాయలు తినడం మంచిదని డైటీషియన్లు చెబుతున్నారు. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ అదుపులో ఉంటాయట.
బరువు తగ్గేందుకు కూడా పచ్చిమిరపకాయలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు కారంపొడి వాడకాన్ని పూర్తిగా మానేసి దాని స్థానంలో పచ్చిమిరపకాయలను వాడడం మంచిదన్నది వారి సజీషన్. కొవ్వును కరిగించడంలో.. క్యాలరీలు వేగంగా ఖర్చవ్వడంలో పచ్చి మిర్చి కీ రోల్ పోషిస్తుందట. శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గించేందుకు కూడా ఉపమోగపడుతుందని డైటీషియన్లు చెబుతున్నారు.
( Note: ఈ కథనంలో సమాచారాన్ని మీ అవగాహన కోసం నిపుణుల నుంచి సేకరించాం. మీకు ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలన్నా, అనుమానాలున్నా ఆరోగ్య నిపుణుడు , డైటీషియన్‌ను సంప్రదించాలి)
Also Read: Viral Photo: అపరంజి బొమ్మ.. అందాల జాబిల్లి.. అప్పట్లో తెలుగునాట సెన్సేషన్.. ఎవరో గుర్తించారా..?