Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: అపరంజి బొమ్మ.. అందాల జాబిల్లి.. అప్పట్లో తెలుగునాట సెన్సేషన్.. ఎవరో గుర్తించారా..?

సోషల్ మీడియాలో ఓ మాజీ హీరోయిన్ ఫోటో ట్రెండ్ అవుతోంది. అందులో ఆమెను ఎవరూ గుర్తించలేకపోతున్నారు. మీరు కనిపెట్టడం కూడా కష్టమే. ఒకసారి ట్రై చేయండి..

Viral Photo: అపరంజి బొమ్మ.. అందాల జాబిల్లి.. అప్పట్లో తెలుగునాట సెన్సేషన్.. ఎవరో గుర్తించారా..?
Tollywood Heroine
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 16, 2022 | 7:46 PM

Tollywood Heroine: నెట్టింట సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ మాజీ హీరోయిన్ ఫోటో ట్రెండ్ అవుతోంది. అందులో ఆమెను ఎవరూ గుర్తించలేకపోతున్నారు. మీరు కనిపెట్టడం కూడా కష్టమే.  మీనాక్షి శేషాద్రి.. ఈ నేమ్ గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. మ్యారేజ్ తర్వాత అమెరికాలో స్థిరపడింది. ఆమె అసలు పేరు శశికళ శేషాద్రి. ఈమె జార్ఖండ్ రాష్ట్రంలోని సింధిలో జన్మించింది. తమిళ కుటుంబానికి చెందిన ఈమె.. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిసి లాంటి డాన్సులలో ప్రావీణ్యం గడించింది. ఢిల్లీలో చదువుకునే సమయంలోనే మిస్ ఇండియాలో పాల్గొని సెలక్ట్ అయ్యింది. ఇక ఈమెకు మోడల్ గా ఛాన్సస్ రావడంతో టాప్ మెడల్ గా రాణించింది. ఈ క్రమంలోనే ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. హిందీలో ‘పెయింటర్ బాబు’ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన మీనాక్షి,  ‘హీరో’ చిత్రంలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్ కపూర్, సన్ని డియోల్ వంటి అగ్ర నటుల సరసన నటించి మెప్పించింది. టాలీవుడ్‌లో చిరంజీవితో కలిసి నటించింది. అన్న ఎన్టీఆర్, బాలయ్య కలిసి నటించిన విశ్వామిత్ర సినిమాలో మేనక పాత్రలో మెరిసింది. అంతేకాదు 1980-90లలో భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ఈమె అమెరికాలో కుటుంబంతో కలిసి నివశిస్తున్నారు. అక్కడ ఆసక్తి ఉన్నవాళ్లకి భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నేర్పుతున్నారు.

ప్రజంట్ మీనాక్షి శేషాద్రికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఆమెను చూసినవాళ్లు అస్సలు పోల్చుకోలేకపోతున్నారు. అప్పట్లో ముద్దు మందారంలా.. ముట్టుకుంటే కందిపోయేలా ఉండేది ఈ నటి. ఇప్పుడు ఆమెకు 58 సంవత్సరాలు. దీంతో వృద్దాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. ఆమె ఎలా ఉన్నా ఎప్పటికీ తమ ఫేవరెట్ హీరోయినే అంటున్నారు మీనాక్షి శేషాద్రి అభిమానులు.

Meenakshi Seshadri

Meenakshi Seshadri

Also Read: Shocking Video: చైన్ స్మోకర్‌లా స్మోక్ చేస్తున్న మేకపోతు.. వీడియో చూస్తే కంగు తినాల్సిందే