AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: చైన్ స్మోకర్‌లా స్మోక్ చేస్తున్న మేకపోతు.. వీడియో చూస్తే కంగు తినాల్సిందే

మేకపోతు పెద్ద మొత్తంలో పొగను పీల్చుతూ... గాలిలోకి వదడాన్ని చూసి చాలామంది షాక్ తింటున్నారు. ఇదెలా సాధ్యం అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

Shocking Video: చైన్ స్మోకర్‌లా స్మోక్ చేస్తున్న మేకపోతు.. వీడియో చూస్తే కంగు తినాల్సిందే
Goat Smoking
Ram Naramaneni
|

Updated on: Feb 16, 2022 | 5:49 PM

Share

Goat Viral Video: స్మోకింగ్(Smoking) చెయ్యడం చాలా అంటే చాలా ప్రమాదం. ఇదే విషయం సిగరెట్ ప్యాకెట్స్ మీద సైతం రాసి ఉంటుంది. ఈ విషయం అర్థమయ్యేలా జంతువులకు కూడా స్పెషల్ క్లాసులు తీసుకుని.. సైన్ బోర్డులు పెట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. లేకపోతే ఏంటండి మరి.. మేకపోతు ఎంచక్కా స్మోక్ చేస్తుంది. అదేదో ఒకసారి అనుకుంటే పొరపాటే.. అలవాటు ఉన్నట్లు పొగను ఆస్వాదిస్తుంది. నేపాల్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వీడియో చూసేవరకు ఈ విషయాన్ని మీరు నమ్మరు కూడా. మేకపోతు పెద్ద మొత్తంలో పొగను పీల్చుతూ… గాలిలోకి వదడాన్ని చూసి చాలామంది షాక్ తింటున్నారు. ఇదెలా సాధ్యం అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొంపదీసి ఇది ఫోటోషాప్, ఎడిటింగ్ మాయాజాలం కాదు కదా అని ప్రశ్నింస్తున్నారు. ట్విట్టర్‌(Twitter)లో ఫిబ్రవరి 6న ఈ వీడియోని పోస్ట్ చేశారు. అప్పటి నుంచి భారీ వ్యూస్, లైక్స్, షేరింగ్స్‌తో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

వీడియోపై మీరు ఓ లుక్కేయండి…

వీడియోని గమనిస్తే ఏదో గుడిలా ఉంది. ఆలయం వద్ద సాంబ్రాణి పొగ వస్తుంటే… ఆ పొగను మేకపోతు పీల్చుతూ వదులుతున్నట్లు కనిపిస్తోంది.  ఈ వీడియో చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ‘జంతువులు కూడా అప్‌డేట్ అయ్యాయి’ అని ఓ యూజర్ కామెంట్ పెట్టగా.. ‘అది తెలియక ఇలా చేసి ఉంటుంది. జీవాలను ఇలాంటి వాటికి దూరంగా ఉంచండి’ అని మరో యూజర్ పేర్కొన్నాడు.

Also Read: Maharshi Raghava : టాలీవుడ్ సీనియర్ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం