AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mammikka: సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయిన 60 ఏళ్ల వృద్ధుడు.. నెట్టింట్లో వీడియోలు వైరల్..

Mammikka: మనిషి జీవితం ఎప్పుడు ఏ విధంగా మారుతుందో ఎవరూ ఊహించలేరు.. దీనినే మన పెద్దలు కాలం కర్మం కలిసి వస్తే.. క్షణాల్లో బండ్లు... ఓడలవుతాయని ఓ సామెతను చెప్పేవారు. మరి ఆ సామెతను నిజం చేస్తూ..

Mammikka: సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయిన 60 ఏళ్ల వృద్ధుడు.. నెట్టింట్లో వీడియోలు వైరల్..
60 Year Old Daily Wage Labo
Surya Kala
|

Updated on: Feb 16, 2022 | 4:06 PM

Share

Mammikka: మనిషి జీవితం ఎప్పుడు ఏ విధంగా మారుతుందో ఎవరూ ఊహించలేరు.. దీనినే మన పెద్దలు కాలం కర్మం కలిసి వస్తే.. క్షణాల్లో బండ్లు… ఓడలవుతాయని ఓ సామెతను చెప్పేవారు. మరి ఆ సామెతను నిజం చేస్తూ..కూలీగా పనిచేసే ఓ 60 ఏళ్ల వృద్ధుడు..ఇప్పుడు మోడల్ గా అయిపోయాడు. ప్రస్తుతం ఈ వ్యక్తి సోషల్ మీడియాలో చిన్న సెలబ్రెటీగా మారాడు. ఎక్కడ చూసినా ఈ వృద్ధుడి గురించే చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే..

కేరళలోని కోజికోడ్ జిల్లా కొడివల్లికి చెందిన 60 ఏళ్ల మమ్మిక్కా ఓ సాధారణ దినసరి కూలీ. ఒక సాదాసీదా షర్ట్ వేసుకొని, లుంగీ కట్టుకొని అదే ప్రాంతంలో తిరిగే ఓ మామూలు మనిషి. అయితే ఇప్పుడు మమ్మిక్క న్యూ లుక్  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అవును.. మమ్మిక్క లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 60 ఏళ్ల మమ్మిక సూపర్ గ్లామ్ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. అరిగిపోయిన, పాత లుంగీ, చొక్కాతో మమ్మిక్క తన ప్రాంతంలో తిరిగే మమ్మిక్కా   మోడల్ లుక్ ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు.

అంతేకాదు ఒక్కసారిగా ఈ మమ్మిక్కా ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు. తనను మోడల్‌గా పెట్టి కేరళకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్.. ఫోటోషూట్ చేశాడు. ఆ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షరీక్ వయాలీల్ అనే ఫోటోగ్రాఫర్ ఒకసారి మమ్మిక్కా ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి విపరీతంగా లైకులు వచ్చాయి. అంతే కాకుండా మమ్మిక్కా కొంచెం యాక్టర్ వినాయకన్‌లాగా ఉన్నాడన్న కామెంట్స్ కూడా వచ్చాయి. అప్పుడే షరీక్‌కు ఒక ఐడియా వచ్చింది. మమ్మిక్కాను మోడల్‌గా పెట్టి ఓ ఫోటోషూట్ చేయాలని, అనుకున్నట్టుగానే ఫోటోషూట్ పూర్తి చేశాడు. మమ్మిక సూట్ ధరించి చేతిలో ఐప్యాడ్‌తో అద్భుతమైన లుక్ లో కనిపించాడు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. మమ్మిక్కా మేక్ ఓవర్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మేక్ఓవర్ మేకప్ ఆర్టిస్ట్ మజ్నాస్ ప్రతిభను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఎప్పుడు సాధారణంగా కనిపించే మమ్మిక్కా ఇంత స్టైలిష్‌గా కూడా ఉండగలడా అని కామెంట్ చేస్తున్నారుఅదే సమయంలో, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా చాలా ప్రజాదరణ పొందుతున్నాయి.

Also Read:

 వేలంలో చారుశర్మ ఘోర తప్పిదం.. తక్కువ ధరకే ముంబయి ప్లేయర్‌ను తన్నుకుపోయిన ఢిల్లీ..

శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్లకు విశేష స్పందన.. శుక్రవారం టికెట్లను సొంతం చేసుకున్న భక్తులు