Hilarious Video: నా మామ కట్నంగా రైలు ఇచ్చారు.. నడపడం రాదని వద్దన్నాను! నాకైతే ఏకంగా రాకెట్‌ ఇచ్చారు తెలుసా..

Viral Video: ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే మగ పెళ్లివారి కోరికల మేరకు కట్నకానుకలు సమర్పించుకోవడం ఎప్పట్నుంచో ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వం వరకట్నాన్ని నిషేధించినా.. కట్నం అనేమాటను ఉపయోగించకుండా ఏదో ఒక రూపంలో కానుకల సమర్పనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మగపెళ్లివారు అవకాశం దొరికిందికదాఅని.. గొంతెమ్మ కోరికలన్నీ ఏకరువుపెట్టి ఆడపెళ్లివారి ఆస్తులన్నీ కరగదీయడం కూడా కొత్తేమీకాదు. ఐతే కట్నం అడిగిన ఓ అల్లుడికి, అతని మామ దిమ్మతిరిగే కట్నం ఇచ్చాడు. ఏమిచ్చాడనేగా మీ సందేహం..? విమానం, ఓడలు, ఏనుగు, […]

Hilarious Video: నా మామ కట్నంగా రైలు ఇచ్చారు.. నడపడం రాదని వద్దన్నాను! నాకైతే ఏకంగా రాకెట్‌ ఇచ్చారు తెలుసా..
Train
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 16, 2022 | 2:04 PM

Viral Video: ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే మగ పెళ్లివారి కోరికల మేరకు కట్నకానుకలు సమర్పించుకోవడం ఎప్పట్నుంచో ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వం వరకట్నాన్ని నిషేధించినా.. కట్నం అనేమాటను ఉపయోగించకుండా ఏదో ఒక రూపంలో కానుకల సమర్పనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మగపెళ్లివారు అవకాశం దొరికిందికదాఅని.. గొంతెమ్మ కోరికలన్నీ ఏకరువుపెట్టి ఆడపెళ్లివారి ఆస్తులన్నీ కరగదీయడం కూడా కొత్తేమీకాదు. ఐతే కట్నం అడిగిన ఓ అల్లుడికి, అతని మామ దిమ్మతిరిగే కట్నం ఇచ్చాడు. ఏమిచ్చాడనేగా మీ సందేహం..? విమానం, ఓడలు, ఏనుగు, రైలు..ఇలాంటివి నీకు కట్నంగా వచ్చుగాక అని స్నేహితులను సరదాగా ఏడిపించడానికి అంటుంటాం. పిల్లనిచ్చిన మామ అల్లుడికి నిజంగానే రైలును కట్నంగా ఇచ్చాడండీ! సదరు అల్లుడు కట్నం కింద ఇచ్చిన రైలును తిరస్కరించాడట. కారణం తెలిస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. ప్రస్తుతం ఈ తతంగానికి సంబంధించని వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలేంజరిగిందంటే..

ఈ వీడియోలో అత్తమామలు కట్నంగా తనకు రైలు ఇచ్చారని చెబుతున్న ఓ యువకుడు కనిపిస్తాడు. అతను దానిని తీసుకోకుండా తిరస్కరించానని చెప్పడం చూడొచ్చు. ఎందుకు తీసుకోలేదని వీడియో తీస్తున్న వ్యక్తి ప్రశ్నించగా..’నాకు రైలు నడపడం రాదు.. అందుకే వద్దన్నానని’ చెబుతాడు. అంతే కాకుండా రైలు పార్క్ చేసేందుకు తన ఇంట్లో స్థలం లేకపోవడంతో రైలును తీసుకునేందుకు నిరాకరించినట్లు చెబుతాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం వింత కామెంట్లతో ఓ ఆట ఆడేసుకున్నారు. నాకు కూడా కట్నంగా మా అత్తింటివారు రాకెట్‌ ఇచ్చారు. కానీ నాకు బైక్‌ నడపడే ఇష్టం అందుకే వద్దన్నానని ఒకరు, ఏంది భయ్యా! నువ్వు అబద్ధం చెబుతున్నట్టున్నావు…ఐనా నువ్వు చెప్పిన విషయం బలే తమాషాగా ఉందని మరొకరు సరదాగా కామెంట్లు చేశారు. ఇక వీడియో ఇప్పటికే దాదాపు 9 లక్షల వీక్షణలు, వేలల్లో లైకులు, కామెంట్లతో సోహల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్‌ అవడంతో, పాత వీడియో అయినప్పటికీ మళ్లీ వార్తల్లో నిలిచింది.

View this post on Instagram

A post shared by memes | comedy (@ghantaa)

Also Read:

ECIL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో ఈసీఐఎల్‌ హైదరాబాద్‌ నోటిఫికేషన్‌.. రాత పరీక్షలేకుండానే ఉద్యోగాలు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!