Tirumala: శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్లకు విశేష స్పందన.. శుక్రవారం టికెట్లను సొంతం చేసుకున్న భక్తులు

Tirumala: ప్రతి ఒక్క హిందువు కల.. జీవితంలో ఒక్కసారైనా కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని.. స్వామివారిని సేవించుకుని తరించాలని. రాజకీయ నేతలు, సెలబ్రెటీలు , సామాన్యులు , పేద ధనిక అనే..

Tirumala: శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్లకు విశేష స్పందన.. శుక్రవారం టికెట్లను సొంతం చేసుకున్న భక్తులు
Tirumala Tirupati Udayastha
Follow us
Surya Kala

|

Updated on: Feb 16, 2022 | 3:19 PM

Tirumala: ప్రతి ఒక్క హిందువు కల.. జీవితంలో ఒక్కసారైనా కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని.. స్వామివారిని సేవించుకుని తరించాలని. రాజకీయ నేతలు, సెలబ్రెటీలు , సామాన్యులు , పేద ధనిక అనే తేడా లేకుండా వెంకన్నను దర్శించుకుంటారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే టీటీడీ సంపన్న భక్తుల కోసం కోసం తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్ల(Srivari Udayasthamana Seva Tickets)ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ ) నేడు 38 సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఈ సేవా టికెట్లకు శ్రీవారి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ టికెట్స్ ను రెండురకాలుగా కేటాయించింది. ప్రానదాన ట్రస్టుకు ఎవరైనా భక్తులు రూ.1.5 కోటి విరాళమిస్తే శుక్రవారం..  రూ.1 కోటి విరాళమిస్తే మిగిలిన రోజుల్లో ఉదయాస్తమాన సేవా భాగ్యం కల్పించనుంది. ఈ క్రమంలో శుక్రవారానికి సంబంధించి శ్రీవారి సేవకు ఆన్‌లైన్‌లో ఉంచిన ఈ టికెట్లన్నింటినీ భక్తులు సొంతం చేసుకున్నారు.

శుక్రవారాల్లో ఉదయస్తమాన సేవా టికెట్లు కలిగిన భక్తులకు సుప్రభాతం, అభిషేకం, తోమాల, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే అవకాశం ఇస్తోంది.

వ్యక్తిగతంగా విరాళమిచ్చిన భక్తులకు 25 ఏళ్లు పాటు సంవత్సరంలో ఒక రోజు దాతతో కలిపి ఆరు గురికి ఉదయస్తమాన సేవను కల్పించనుంది. అదే ఏవైనా కంపెనీలు అయితే 20 ఏళ్ల పాటూ ఉదయస్తమాన సేవను కల్పించనుంది.

Also Read:

ఆంజ‌నేయుడి జ‌న్మస్థాన అభివృద్ధికి టీటీడీ శ్రీకారం.. మరికాసేపట్లో శంఖుస్థాపన కార్యక్రమం..

తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు
లేటు వయసులో పెళ్లిపీటలెక్కిన నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరో తెలుసా?
లేటు వయసులో పెళ్లిపీటలెక్కిన నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరో తెలుసా?
మరికాసేపట్లో మెగా డీఎస్సీ సిలబస్ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
మరికాసేపట్లో మెగా డీఎస్సీ సిలబస్ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
నేడు తుఫాన్‌గా మారనున్న వాయుగుండం.. ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ
నేడు తుఫాన్‌గా మారనున్న వాయుగుండం.. ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ
ఆర్సీబీపై సిరాజ్‌ మియా పోస్ట్..కట్ చేస్తే.. సీన్‌లోకి రషిద్ ఖాన్
ఆర్సీబీపై సిరాజ్‌ మియా పోస్ట్..కట్ చేస్తే.. సీన్‌లోకి రషిద్ ఖాన్
Horoscope Today: ఉద్యోగంలో వారి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారి హోదా పెరిగే ఛాన్స్..
ఐపీఎల్ వేలంలో పృథ్వీ షాను కొనుగోలు చేయకపోవడానికి కారణం అదేనా?
ఐపీఎల్ వేలంలో పృథ్వీ షాను కొనుగోలు చేయకపోవడానికి కారణం అదేనా?
పెయిడ్ ప్రీమియర్స్ వల్ల ఉపయోగం లేనట్టేనా ??
పెయిడ్ ప్రీమియర్స్ వల్ల ఉపయోగం లేనట్టేనా ??