Anjanadri-TTD: ఆంజనేయుడి జన్మస్థాన అభివృద్ధికి టీటీడీ శ్రీకారం.. మరికాసేపట్లో శంఖుస్థాపన కార్యక్రమం..
తిరుమలలో హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అభివృద్ధికి శ్రీకారం చుట్టింది టీటీడీ. ఇవాళ ఉదయం శంఖుస్థాపన మహోత్సవం చేపట్టారు. హనుమంతుని జన్మస్థలాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసి, సుందరీకరణ చేపట్టేందుకు
తిరుమలలో (Tirumala)హనుమంతుని జన్మస్థలం(Hanuman birthplace) అంజనాద్రి(Anjanadri) అభివృద్ధికి శ్రీకారం చుట్టింది టీటీడీ(TTD). ఇవాళ ఉదయం శంఖుస్థాపన మహోత్సవం చేపట్టారు. హనుమంతుని జన్మస్థలాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసి, సుందరీకరణ చేపట్టేందుకు శంఖుస్థాపన చేశారు. ఆకాశగంగ ప్రాంతంలోని అంజనాదేవి, బాల ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా ముఖ మండపం, గోపురాలు, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది టీటీడీ. దాతలు నారాయణం నాగేశ్వరరావు, కొట్టు మురళీకృష్ణ ఆర్ధిక సహాయంతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి- తిరుమల అనే పేరుతో పౌరాణిక- వాఙ్మయ- శాసన- చారిత్రకాధారాలతో సిద్ధం చేసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఇందులో హనుమంతుని జన్మవృత్తాంతాన్ని పొందుపరిచారు. విశాఖ శారద పీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతీ స్వామి, అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవిందదేవ్ గిరి జీ మహారాజ్, చిత్రకూట్ పీఠాధిపతి రామభద్రాచార్యులు, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ కప్పగంతుల కోటేశ్వర శర్మ వంటి ఆధ్యాత్మిక ప్రముఖులు శంకుస్థాపన మహోత్సంలో పాల్గొన్నారు.
అంజనాద్రినే హనుమంతుని జన్మస్థలంగా కమిటీ నిర్ధారించడంతో టీటీడీ అధికారి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను చేపట్టింది టీటీడీ. గతేడాది జన్మస్థలాన్ని నిర్ధారించిన కమిటీ పురాణ, వాగ్మయ, భౌగోళిక ఆధారాలతో అంజనాద్రిలోనే హనుమంతుడు జన్మించినట్లు నిర్ధారించింది. 2021, ఏప్రిల్ 21న శ్రీరామనవమినాడు పూర్తి ఆధారాలతో హనుమంతుని జన్మస్థలం తిరుమల అని టిటిడి నిరూపించింది. బుక్ లెట్ కూడా టిటిడి విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి: Ukraine Russia Crisis: ర్యష్యా వెనక్కి తగ్గలేదు.. పుతిన్ యుద్ధతంత్రంపై అమెరికా కీలక ప్రకటన..
Rudraksha Tree: మన తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు.. ఎక్కడో తెలుసా?