Ukraine Russia Crisis: ర్యష్యా వెనక్కి తగ్గలేదు.. పుతిన్‌ యుద్ధతంత్రంపై అమెరికా కీలక ప్రకటన..

రష్యా‌‌-ఉక్రెయిన్​ సంక్షోభం. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించిన రష్యా. అనూహ్య పరిణామం దేనికి సంకేతం?. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కలుగుతున్న అనుమానాలు. కొద్ది వారాలుగా నెలకొన్న ఉత్కంఠకు..

Ukraine Russia Crisis: ర్యష్యా వెనక్కి తగ్గలేదు.. పుతిన్‌ యుద్ధతంత్రంపై అమెరికా కీలక ప్రకటన..
Russian Pull Back
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 16, 2022 | 6:54 AM

రష్యా‌‌-ఉక్రెయిన్​ సంక్షోభం. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించిన రష్యా. అనూహ్య పరిణామం దేనికి సంకేతం?. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కలుగుతున్న అనుమానాలు. కొద్ది వారాలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించే ప్రయత్నం చేసింది రష్యా. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి కొంతమంది సైన్యాన్ని వెనక్కి రప్పించినట్లు ప్రకటించింది రష్యా. అమెరికా అనుకూల ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేస్తుందనే భయాల నేపథ్యంలో ఈ చర్యను ప్రకటించింది రష్యా. అయితే ఉక్రెయిన్‌ సరిహద్దుల లోని కొన్ని ప్రాంతాల నుంచి రష్యా వెనక్కి తగ్గినప్పటికి యుద్ద భయం వదలడం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమవుతుందన్న అమెరికా రక్షణశాఖ తాజా నివేదిక తీవ్ర సంచలనం రేపుతోంది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధందాకా వెళ్లిన ఉద్రిక్తత తగ్గుతోందా ? అనే ప్రశ్నకు మాత్రం ఇంకా సమాధానం దొరకడం లేదు. ఉక్రెయిన్‌ బోర్డర్‌లోని దక్షిణ, పశ్చిమ మిలటరీ జిల్లాల నుంచి ట్రైనింగ్‌ ఎక్సరసైజులు, డ్రిల్స్‌ ముగిసినందున అక్కడినుంచి తమ సైనికబలగాలు వెనక్కి వస్తున్నట్లు రష్యా ప్రకటించింది.

రోడ్డు , రైలు మార్గాల్లో బలగాలు రిటన్ అయినట్లు తెలిపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ భేటీ అవుతున్న సమయంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే రష్యా బలగాల ఉపసంహరణపై తమకు పెద్దగా నమ్మకం లేదని ఉక్రెయిన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఓవైపు బలగాల ఉపసంహణ అంటూనే మరోవైపు ముప్పేట దాడికి సిద్దమవుతున్నారని ఆరోపించింది ఉక్రెయిన్.

రష్యా ప్రకటనను నాటో సభ్యదేశాలు కూడా నమ్మడం లేదు. పూర్తిస్థాయిలో రష్యా దళాలు వెనక్కి తగ్గితేనే ఆ దేశాన్ని నమ్మొచ్చని బ్రిటన్‌ విదేశాంగమంత్రి లిజ్‌ ట్రస్‌ చెప్పారు. అప్పటిదాకా రిస్క్‌ తప్పదన్నారు. ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ద వాతావరణం నేపథ్యంలో భారత్‌ అలర్ట్ అయింది.

ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు స్వదేశానికి వ‌చ్చేయాల‌ని కోరింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్​లోని భారత రాయబార కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌లో దాదాపు 18 వేల నుంచి 20వేల మంది వరకు భారతీయులు ఉంటారని అంచనావేసింది కేంద్రం. మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్న తెలంగాణ, ఏపీకి చెందిన 200 మందికి పైగా విద్యార్థులున్నారు. విద్యార్థులు భయంతో అక్కడ ఉండలేక, చదువులను మధ్యలో వదిలేసి రాలేక సతమతమవుతున్నారు. రాలేని పక్షంలో ఉక్రెయిన్‌లోని భారత్ ఎంబసీతో టచ్‌లో ఉండాలని కేంద్రం తెలిపింది.

అయితే.. గత రెండు రోజులుగా ఉక్రెయిన్‌పై దాడికి రష్యా పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఫైటర్ జెట్ హైపర్సోనిక్ క్షిపణులు మోహరింపబడ్డాయి. S-400 ఫైర్ మోడ్‌కు సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్ సరిహద్దులో దాదాపు 2 లక్షల మంది రష్యా సైనికులను దింపింది. సరిహద్దుకు రష్యా నిరంతరం ఆయుధాలను అందజేస్తోందని నాటో పేర్కొంది. ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత ఇరుదేశాల సరిహద్దుల్లో ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మోహరించారు. మరోవైపు, బ్రిటన్‌లోని ఫెయిర్‌ఫోర్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో 4 సూపర్-డిస్ట్రాయర్ B-52 బాంబర్‌లను మోహరించిన ఉక్రెయిన్‌తో అగ్రరాజ్యం అమెరికా నిలుస్తోంది.

కొద్ది వారాలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించే ప్రయత్నం చేసింది రష్యా. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి కొంతమంది సైన్యాన్ని వెనక్కి రప్పించినట్లు ప్రకటించింది రష్యా. అయితే ఉక్రెయిన్‌ సరిహద్దుల లోని కొన్ని ప్రాంతాల నుంచి రష్యా వెనక్కి తగ్గినప్పటికి యుద్ద భయం వదలడం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమవుతుందన్న అమెరికా రక్షణశాఖ తాజా నివేదిక తీవ్ర సంచలనం రేపుతోంది.

నివేదిక ప్రకారం, యుఎస్ ఇంటెలిజెన్స్ ప్రకారం, రష్యా ఎప్పుడైనా ఉక్రెయిన్‌పై దాడి చేయవచ్చు. విదేశీ వ్యవహారాల నిపుణుడు సుశాంత్ సరిన్ టీవీ 9 భరతవర్ష్‌తో మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై దాడి చేయడం అంత సులభం కాదని, ఎందుకంటే వారి వద్ద పెద్ద సంఖ్యలో ఆయుధాలు ఉన్నాయి, అలాగే ప్రపంచం నలుమూలల నుండి సహాయం కూడా ఉంది. రష్యా సరిహద్దుల్లో మోహరించినంత మంది సైనికులను ఉక్రెయిన్ లాంటి దేశంపై దాడి చేయడం సాధ్యం కాదు.

ఇవి కూడా చదవండి: UP Election 2022: తగ్గేదెలే.. ఉచిత ఎన్నికల తాయిలాల్లో బీజేపీ – ఎస్పీ పోటాపోటీ..

Viral Photo: ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఇప్పుడు కుర్రాళ్ల హాట్ ఫేవరెట్.. ఎవరో గుర్తుపట్టారా!