AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఇప్పుడు కుర్రాళ్ల హాట్ ఫేవరెట్.. ఎవరో గుర్తుపట్టారా!

ఈ మధ్యకాలంలో నటీమణుల సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ షేర్..

Viral Photo: ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఇప్పుడు కుర్రాళ్ల హాట్ ఫేవరెట్.. ఎవరో గుర్తుపట్టారా!
Krithi Shetty
Ravi Kiran
|

Updated on: Feb 15, 2022 | 6:26 PM

Share

ఈ మధ్యకాలంలో నటీమణుల సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. సినిమా అప్‌డేట్స్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రేర్ పిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడూ ఇన్‌స్టా లైవ్‌లలోకి వస్తూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఇక ‘త్రోబ్యాక్’ ఫోటోల ట్రెండ్ సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అకేషన్ వచ్చినప్పుడల్లా హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? చిరునవ్వులు చిందిస్తూ.. ఫోటోకు పోజిస్తున్న ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఓ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. చేసింది తక్కువే సినిమాలు కానీ అబ్బాయిలకు హాట్ ఫేవరెట్.. ఈ ముద్దుగుమ్మ నటించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ‘ఉప్పెన’లా కలెక్షన్లు రాబట్టింది. ఎవరో గుర్తుపట్టారా.? ఈపాటికి మీకు అర్ధమై ఉండొచ్చు. ఆమెవరో కాదు కృతి శెట్టి.

‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ‘బేబమ్మ’గా పరిచయమైన కృతి శెట్టి.. మొదటి చిత్రంతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘శ్యామ్ సింగ్ రాయ్’, ‘బంగార్రాజు’ మూవీస్‌తో నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసింది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.