AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: అదృష్టమంటే ఈ అందాల భామదే.. తక్కువ టైమ్‌లోనే ప్రభాస్‌తో నటించే ఛాన్స్‌..

Prabhas: సినిమాల్లో రాణించాలంటే ట్యాలెంట్‌ ఎంత ముఖ్యమో అదృష్టం కూడా అంతే ముఖ్యమంటుంటారు. కొందరు కెరీర్ మొదలు పెట్టిన కొన్ని రోజుల్లోనే అగ్ర స్థానానికి చేరుకుంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు వరుసగా బడా ఆఫర్లను...

Prabhas: అదృష్టమంటే ఈ అందాల భామదే.. తక్కువ టైమ్‌లోనే ప్రభాస్‌తో నటించే ఛాన్స్‌..
Prabhas Latest Movie
Narender Vaitla
|

Updated on: Feb 15, 2022 | 5:58 PM

Share

Prabhas: సినిమాల్లో రాణించాలంటే ట్యాలెంట్‌ ఎంత ముఖ్యమో అదృష్టం కూడా అంతే ముఖ్యమంటుంటారు. కొందరు కెరీర్ మొదలు పెట్టిన కొన్ని రోజుల్లోనే అగ్ర స్థానానికి చేరుకుంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు వరుసగా బడా ఆఫర్లను దక్కించుకుంటూ స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరుతుంటారు. తాజాగా ఓ కుర్ర హీరోయిన్‌ ఇలాంటి ఓ బంపరాఫర్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరనేగా.. ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల. ఒక్కటంటే ఒక్క సినిమాలో నటించిన అమ్మడుకి వరుస ఆఫర్లను క్యూకడుతున్నాయి. శ్రీలీల ఇప్పటికే రవితేజతో నటించే ఛాన్స్‌ కొట్టేసిన విషయం తెలిసిందే. అంతేనా.. మహేష్‌బాబు, త్రివ్రికమ్‌ సినిమాతో పాటు బాలకృష్ణకు కూతురిగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ అమ్మడు భారీ లక్కీ ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది.

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించే అవకాశం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను రాజా డీలక్స్‌ పేరుతో తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉంటే హర్రర్‌ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని, వారిలో ఒక హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకోనున్నారని వార్త చక్కర్లు కొడుతోంది.

Prabhas

ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసుకునే మధ్యలో మారుతి సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. మరి శ్రీలీల ప్రభాస్‌ సినిమాలో నటించనుందన్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ప్రభాస్‌ ప్రస్తుతం ఆదిపురుష్‌, సలార్‌లతో పాటు నాగ అశ్విన్‌, సందీప్‌ వంగ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే.

Also Read: Chankya Niti: ఈ నాలుగు అలవాట్లు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ జీవితంలో ఓటమిని ఎదుర్కొంటారు అంటున్న చాణక్య..

Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఆ సేవలకు రేపటి నుంచి టికెట్లు కేటాయింపు..

Bjp vs Trs: సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్.. సవాల్‌కు సిద్ధమంటూ.. లైవ్ వీడియో

Medaram Maha Jatara 2022: ఆ నాలుగు రోజులూ మహానగరంగా మారిపోయే కుగ్రామం