AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chankya Niti: ఈ నాలుగు అలవాట్లు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ జీవితంలో ఓటమిని ఎదుర్కొంటారు అంటున్న చాణక్య..

Chankya Niti: ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం( Niti-Shastra)లో మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించాడు. చాణుక్యుడు తన జీవితానుభవంతో చెప్పిన విషయాలను ప్రస్తుత సమాజంలో..

Chankya Niti: ఈ నాలుగు అలవాట్లు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ జీవితంలో ఓటమిని ఎదుర్కొంటారు అంటున్న చాణక్య..
Chanakya Niti
Surya Kala
|

Updated on: Feb 15, 2022 | 4:02 PM

Share

Chankya Niti: ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం( Niti-Shastra)లో మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించాడు. చాణుక్యుడు తన జీవితానుభవంతో చెప్పిన విషయాలను ప్రస్తుత సమాజంలో నేటి జనరేషన్ కు అనుసరణీయం. . ఆచార్య చాణుక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా పిల్లలకు, పెద్దలకు , పెద్దలకు ఏదో ఒక పాఠాన్ని అందించాడు. అలా చాణుక్యుడు చెప్పిన విషయాలను పాటిస్తే.. ఎంతటి కష్టమైనా తేలికగా నివారించుకోవచ్చు. ఒక వ్యక్తి తన జీవితంలో చాణుక్యుడు చెప్పిన విషయాలను అనుసరిస్తే.. అపజయాలను నివారించుకోవచ్చు. అయితే కొంతమంది వ్యక్తులు కొన్ని అలవాట్లను ఎప్పుడూ విడిచి పెట్టారని.. ఇలాంటి వారు ఎల్లపుడూ ఓటమిని ఎదుర్కోవాల్సి ఉంటుందని చాణుక్యుడు చెప్పాడు. ఇప్పుడు ఆ అలవాట్లు లేదా తప్పులు ఏమిటో తెలుసుకుందాం..

స్వీయ-కేంద్రీకృతం:  ఒక వ్యక్తి విజయం సాధించినప్పుడు తనవలనే విజయం దక్కిందని.. అహంభావానికి లోనవుతాడు. అటువంటి వ్యక్తి జీవితంలో ఒకానొక సమయంలో ఓటమిని ఎదుర్కోవలసి ఉంటుందని ఆచార్య చాణుక్యుడు చెప్పాడు. లేదంటే ఒంటరిగా ఉంటాడు. అహంకారం, అన్నింటికంటే తాను మిన్నగా భావించడం పెద్ద తప్పు అని చెప్పాడు.  అలాంటి వ్యక్తి ఇంటి బయట కూడా తాను గొప్ప అనే భావన కలిగి ఉంటాడు. దీంతో అటువంటి వ్యక్తులను కుటుంబసభ్యులు కూడా దూరం పెడతారని చెప్పారు. కనుక ఒక వ్యక్తి ఎంత గొప్ప విజయం సాధించినా,  ఎప్పుడూ ఒదిగి ఉండాలని సూచించాడు.

నెగిటివ్ ఆలోచనలు కలిగిన వారు:  కొంతమంది సమస్య ఏర్పడగానే నెగెటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటారు. దీంతో వారి జీవితంలో ఆర్థికంగానే కాకుండా శారీరకంగా కూడా సమస్యలు మొదలవుతాయి. అందుకనే నెగెటివ్ ఆలోచనలు కలిగి ఉన్నవారు కష్టమైన సమయాలను ఎదుర్కోవాలని చాణక్యుడు చెప్పాడు. కనుక ఎప్పుడూ పరిస్థితులను సానుకూలంగా మార్చుకోవడం ద్వారా.. భిన్నమైన శక్తిని పొందుతారు.. ఎటువంటి కష్టాలు ఎదురైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది.

సమయం ప్రాముఖ్యత:  ఆచార్య చాణక్యుడు ప్రకారం, సమయం ప్రాముఖ్యతను అర్థం చేసుకోని వారు తరచుగా వైఫల్యాలతో పాటు ఓటమిని కూడా  ఎదుర్కొంటారు. ఏ పని చేపట్టినా సమయపాలన లేనివారు ఈజీగా ఇంటిబాట పడతారని చాణక్యుడు చెప్పాడు. నిజానికి గడిచిన కాలం మనిషి జీవితంలో ఎన్నడూ తిరిగి రాదు. ప్రతి ఒక్క క్షణం వ్యక్తిగతంగానే కాదు.. వృత్తి పరంగా కూడా చాలా విలువైనదని అని గుర్తుంచుకోవాలని చాణక్యుడు సూచించాడు.

కోపం కొంతమందికి చిన్న చిన్న విషయాలకు కోపం వస్తుంది. దీంతో వీరు చాలా నష్టాలను జీవితంలో ఎదుర్కోవలసి ఉంటుందని ఆచార్య చెప్పారు. కోపం వలన జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజానికి కోపం కలిగి ఉండే వ్యక్తులను ప్రజలు ఇష్టపడరు. అంతేకాదు.. అలాంటి వ్యక్తుల దగ్గరకు కూడా చేరరు.

Also Read:

మీ పాత ఫోన్‌ను అమ్మేయాలనుకుంటున్నారా.? ఫ్లిక్‌కార్ట్‌తో మీ పని మరింత ఈజీ..