Medaram Jatara 2022: వనదేవతలు చల్లగా చూడాలి.. తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు..
Medaram Jatara 2022: తెలంగాణ కుంభమేళా(Telangana Kumbhamela).. అడవి బిడ్డలను ప్రత్యేకంగా నిలిపే జాతర మేడారం జాతర. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిస్తూ.. ఈ విగ్రహం లేకుండా..
Medaram Jatara 2022: తెలంగాణ కుంభమేళా(Telangana Kumbhamela).. అడవి బిడ్డలను ప్రత్యేకంగా నిలిపే జాతర మేడారం జాతర. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిస్తూ.. ఈ విగ్రహం లేకుండా జరిగే ఈ జాతరకు భక్తులు పోటెత్తుతారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ సమ్మక్క, సారలమ్మ జాతరకు రాష్ట్రంలోని అన్ని దారులు మేడారం వైపే అన్న చందంగా ఉంటుంది. వనదేవతలను కొలిచే ఈ మేడారం జాతర రేపటి నుంచి నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మహిమాన్వితమైన మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా అడవితల్లి బిడ్డలకు భక్తిపూర్వక శుభాకాంక్షలను చెప్పారు.
రేపటి నుంచి ప్రారంభం కానున్న వనదేవతల సమ్మక్క-సారలమ్మ జాతర భారతీయ సనాతన ధార్మిక విశిష్టతకు నిలువెత్తు నిదర్శనం అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ దేవతలు అడవి బిడ్డల వీరత్వానికి ప్రతీకలు అని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో అత్యంత ఘనంగా జరిగే ఈ గిరిజన జాతర దేశానికే తలమానికం అంటూ జనసేనాని కీర్తించారు.
రాష్ట్రంతో పాటు, దేశం నలుమూల నుంచి గిరిజనులు, గిరిజనేతరులు ఇలవేల్పుగా పూజిస్తున్న ఈ శక్తి స్వరూపిణినుల జాతర నయనాందకరం, భక్తి, ముక్తిదాయకమని చెప్పారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం మేడారం గద్దె అని.. దేశ ప్రజలందరినీ దుష్ట శక్తుల నుంచి ఈ వనదేవతలు కాపాడాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ శక్తి స్వరూపిణిలు ప్రజలను చల్లగా చూడాలని ప్రణామాలు అర్పిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన చేశారు.
ప్రజలను వనదేవతలు చల్లగా చూడాలి – JanaSena Chief Shri @PawanKalyan #MedaramJatara #SammakkaSaralamma#tribalfestival pic.twitter.com/DJ82lUuEX1
— JanaSena Party (@JanaSenaParty) February 15, 2022
Also Read: