Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: ఇంకా ముగిసిపోలేదు.. కరోనావైరస్ అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు..

Corona Virus: చైనా(china)లో 2019 డిసెంబర్ లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి.. ప్రపంచ దేశాలను గత రెండేళ్లుగా వణికిస్తూనే ఉంది. వివిధ రూపాలను సంతరించుకుని మానవాళిని తీవ్ర భయబ్రాంతులకు..

Coronavirus: ఇంకా ముగిసిపోలేదు.. కరోనావైరస్ అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు..
WHO
Follow us
Surya Kala

|

Updated on: Feb 15, 2022 | 8:01 PM

Corona Virus: చైనా(china)లో 2019 డిసెంబర్ లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి.. ప్రపంచ దేశాలను గత రెండేళ్లుగా వణికిస్తూనే ఉంది. వివిధ రూపాలను సంతరించుకుని మానవాళిని తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తోంది. గత కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమి క్రాన్ వేరియంట్ విజృంభణ ఓ రేంజ్ లో కొనసాగింది. దీంతో అన్ని దేశాలు నిబంధనలు అమలు చేశాయి. అయితే గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న  నేపథ్యంలో మళ్ళీ ప్రపంచలో అనేక దేశాలు కరోనా నిబంధనలు సడలించాయి. ప్రజలు యధావిధిగా తమ కార్యక్రమాలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ పై డబ్ల్యూహెచ్‌ఓ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మహమ్మారి విజృంభణ ఇంకా ముగిసి పోలేదంటూ ఇటీవల హెచ్చరించింది.

అయితే ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయితే ఈ కరోనా మహమ్మారి తీవ్రమైన దశ ఈ ఏడాదిలో ముగుస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ వెల్లడించారు.  భారత్, అమెరికా, యురేపియన్ దేశాల్లో బూస్టర్ డోసు ఇస్తున్నా.. ప్రపంచంలో ఇంకా వ్యాక్సిన్ పూర్తికాని దేశాలు ఇంకా అనేకం ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా

ఆఫ్రికా ఖండంలో 11 శాతం మందికి మాత్రమే కొవిడ్‌ వ్యాక్సినేషన్ పూర్తయిందని ఇంకా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వేగం పెంచాల్సి ఉందని తెలిపింది. ఈ ఖండంలో 70 శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రస్తుత వ్యాక్సినేషన్ వేగాన్ని ఆరు రెట్లు పెంచాల్సి ఉంటుందని తెలిపింది.

ఆఫ్రిజెన్ బయోలాజిక్స్ మోడెర్నా సీక్వెన్స్‌ను ఉపయోగించి ఆఫ్రికాలో మొట్టమొదటి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ కేంద్రాన్ని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ అధనామ్‌తోపాటు డబ్ల్యూహెచ్‌ఓ శాస్త్రవేత్తలు సందర్శించారు. డబ్ల్యూహెచ్‌ఓ,  కొవాక్స్‌ సహకారంతో ఆఫ్రిజెన్‌.. ఈ ప్రాజెక్టు చేపడుతోంది. 2024లో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యాక్సిన్ తక్కువ ధరకు లభిస్తుందని.. అంతేకాదు నిల్వ చేసే విషయంలో కూడా వెసులుబాటు ఉంటుందని… తక్కువ జాగ్రత్తలతో నిల్వ చేయాల్సివచ్చే సందర్భాల్లో ఈ వ్యాక్సిన్ అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయాన్ని అధనామ్‌ వ్యక్తం చేశారు.

Also Read:

కలకలం రేపుతోన్న మరో ప్రాణాంతక వైరస్‌.. తొలి మరణం నమోదు.. పూర్తి వివరాలు..