AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: మృతదేహానికి కరోనా నిర్ధారణ పరీక్షలు.. 41 రోజుల్లో ఏకంగా 28 సార్లు పాజిటివ్‌.. ఆశ్చర్యపోయిన వైద్యులు..

మృతదేహాల నుంచి కరోనా (Corona Virus) వ్యాప్తి చెందదని ఇప్పటివరకు వైద్యులు చెప్పుకొచ్చారు. శవాల నుంచి కొవిడ్‌ (Covid 19) వ్యాప్తి చెందినట్లు కొన్ని పరిశోధనల్లో కూడా వెల్లడైంది.

Coronavirus: మృతదేహానికి కరోనా నిర్ధారణ పరీక్షలు.. 41 రోజుల్లో ఏకంగా 28 సార్లు పాజిటివ్‌.. ఆశ్చర్యపోయిన వైద్యులు..
Basha Shek
|

Updated on: Feb 15, 2022 | 8:58 PM

Share

మృతదేహాల నుంచి కరోనా (Corona Virus) వ్యాప్తి చెందదని ఇప్పటివరకు వైద్యులు చెప్పుకొచ్చారు. శవాల నుంచి కొవిడ్‌ (Covid 19) వ్యాప్తి చెందినట్లు కొన్ని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. ఇదే సమయంలో మృతదేహాల్లో కరోనా వైరస్‌ ఎంతకాలం సజీవంగా ఉంటున్నదానిపై ఎలాంటి స్పష్టత లేదు. గతంలో జర్మన్‌ పరిశోధకుల అధ్యయనంలో పోస్ట్‌మార్టం తర్వాత 35 గంటల వరకు వైరస్ శరీరంలో వృద్ధి చెందుతున్నట్లు తేలింది. కాగా సముద్రంలో మునిగి చనిపోయిన వ్యక్తి మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించిన పరిశోధకులు.. ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. 41 రోజుల్లో 28సార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ప్రతిసారీ కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

ఆరువారాల పాటు టెస్ట్‌లు..

ఉక్రెయిన్​కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి.. కొద్దిరోజుల క్రితం ఇటలీలో ఓ స్నేహితుడితో కలిసి బీచ్​కు వెళ్లాడు. ఆ సమయంలో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా సముద్రంలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. సుమారు 16 గంటల తర్వాత అతడి మృతదేహం సముద్రంలోని రెండు బండరాళ్ల మధ్య చిక్కుకుని కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. చనిపోవడానికి ముందు ఆ వ్యక్తికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. అయితే ఇటలీ ప్రభుత్వ కొవిడ్ నిబంధనల ప్రకారం శవ పరీక్షకు ముందు కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ఆశ్చర్యకరంగా ఆ మృతదేహానికి కొవిడ్‌ పాజిటివ్ అని తేలింది.

28 సార్లు పాజిటివ్‌.. కాగా అంత్యక్రియల నిర్వహణకు అనుమతులు లేనందున.. ఆ వ్యక్తి మృతదేహాన్ని 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. అయితే ఆ సమయంలో డి అన్నున్​జియో విశ్వవిద్యాలయ వైద్యులు.. ఆ శవానికి వరుసగా ఆర్​టీపీసీఆర్ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 41 రోజుల్లో 28సార్లు శాంపిల్స్‌ తీసి పరీక్షించగా.. ప్రతిసారీ పాజిటివ్ అనే ఫలితం వచ్చింది. ఆ తర్వాత అంత్యక్రియలు జరపడం వల్ల కరోనా టెస్టులు చేయడం కుదరలేదు. తాజా ఫలితాలతో కరోనా వైరస్‌పై తమ పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళతాయని ఇటలీ వైద్యులు చెబుతున్నారు.

78 సార్లు పాజిటివ్‌.. 14 నెలలు ఐసోలేషన్‌లో..

కాగా టర్కీకి చెందిన ముజఫర్​ కయాసన్​(56) 2020 నవంబర్​లో తొలిసారి కరోనా బారిన పడ్డాడు. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. కొద్దిరోజులకే కోలుకున్నాడు. లక్షణాలేవీ లేవు. కానీ టెస్టు చేస్తే మాత్రం పాజిటివ్ అనే వచ్చింది. చేసేదేం లేక మరికొద్ది రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాడు. తర్వాత ఎన్నిసార్లు పరీక్షించినా ఫలితంలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతిసారీ కొవిడ్ పాజిటివ్ అనే వస్తోంది. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జై ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండడం మొదలుపెట్టాడు ముజఫర్. మంచి ఆహారం తీసుకుంటూ తగిన ఔషధాలు వాడుతున్నాడు. అయినా ఫలితం మారలేదు. ఇప్పటివరకు 78 సార్లు పరీక్షించినా.. కొవిడ్ పాజిటివ్ అనే వచ్చింది.

Also Read:Naveen Chandra: ప్రేమికుల రోజున సతీమణిని పరిచయం చేసిన నవీన్‌ చంద్ర.. క్యూట్‌ కపుల్‌ అంటోన్న నెటిజన్లు..

Virat Kohli: కింగ్‌ కోహ్లీ ఆశలపై నీళ్లు చల్లిన బీసీసీఐ.. వందో టెస్ట్‌ వేదిక బెంగళూరు నుంచి మరొక చోటుకు..

Kurnool: న్యాయం కావాలంటూ పాతిపెట్టిన కూతురు మృతదేహాన్ని వెలికితీయాలన్న తండ్రి.. అడ్డుకున్న పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..