AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naveen Chandra: ప్రేమికుల రోజున సతీమణిని పరిచయం చేసిన నవీన్‌ చంద్ర.. క్యూట్‌ కపుల్‌ అంటోన్న నెటిజన్లు..

'అందాల రాక్షసి' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు నవీన్‌ చంద్ర (Naveen Chandra). నటనా పరంగా మొదటి సినిమాతోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు.

Naveen Chandra: ప్రేమికుల రోజున సతీమణిని పరిచయం చేసిన నవీన్‌ చంద్ర.. క్యూట్‌ కపుల్‌ అంటోన్న నెటిజన్లు..
Naveen Chandra
Basha Shek
|

Updated on: Feb 15, 2022 | 8:19 PM

Share

‘అందాల రాక్షసి’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు నవీన్‌ చంద్ర (Naveen Chandra). నటనా పరంగా మొదటి సినిమాతోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దళం, త్రిపుర, లక్ష్మీదేవికి ఓ లక్కుంది, మీలో ఎవరు కోటీశ్వరుడు, జూలియల్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌ తదితర సినిమాల్లో హీరోగా నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇక ఎన్టీఆర్‌ (NTR) హీరోగా నటించిన ‘అరవింద సమేత’ సినిమాలోని బాల్‌రెడ్డి పాత్ర అతనికి మంచి పేరు తీసుకొచ్చింది. భానుమతి అండ్‌ రామకృష్ణ, పరంపర వెబ్‌ సిరీస్‌ లతో మెప్పించాడు. సినిమాల సంగతి పక్కన పెడితే నవీన్‌ చంద్ర వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అతను కూడా ఎప్పుడూ తన పర్సనల్‌ లైఫ్‌ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే ప్రేమికుల రోజున ( Valentines Day) తన సతీమణిని పరిచయం చేసి అందరికీ షాకిచ్చాడీ హీరో.

మేడంగారు ఏం చేస్తుంటారు?

ఈ సందర్భంగా తన భార్యతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్‌ చేసుకున్న నవీన్‌ చంద్ర. ‘ప్రేమ ఎప్పటికీ గుండెల్లో నిలిచి ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్‌ డే వైఫీ. నా బెటర్‌ హాఫ్‌ ఓర్మా’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్‌చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు ‘అసలు నవీన్‌ చంద్రకు పెళ్లి ఎప్పుడు అయ్యింది? మేడంగారు ఏం చేస్తుంటారు? ఏదైతేనెం మీకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు, క్యూట్‌ కపుల్‌’ అంటూ అభిమానులు నవీన్‌ దంపతులకు విషెస్‌ చెబుతున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్‌ ‘గని’, రానా ‘విరాట పర్వం’, సినిమాల్లో నటిస్తున్నాడు నవీన్‌ చంద్ర.

Also Read:Virat Kohli: కింగ్‌ కోహ్లీ ఆశలపై నీళ్లు చల్లిన బీసీసీఐ.. వందో టెస్ట్‌ వేదిక బెంగళూరు నుంచి మరొక చోటుకు..

Viral Video: ఫుల్లుగా తాగి అర్ధరాత్రి పోలీసులకు ఫోన్‌ చేసిన ఘనుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Kurnool: న్యాయం కావాలంటూ పాతిపెట్టిన కూతురు మృతదేహాన్ని వెలికితీయాలన్న తండ్రి.. అడ్డుకున్న పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..