Viral Video: ఫుల్లుగా తాగి అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసిన ఘనుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
మద్యం మత్తులో కొందరు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఎవరెవరికో కాల్ చేసి విసిగిస్తుంటారు. అలాంటివారివల్ల ఎదుటివారికి తీవ్ర ఇబ్బందులు, సమస్యలు కలుగుతుంటాయి.
మద్యం మత్తులో కొందరు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఎవరెవరికో కాల్ చేసి విసిగిస్తుంటారు. అలాంటివారివల్ల ఎదుటివారికి తీవ్ర ఇబ్బందులు, సమస్యలు కలుగుతుంటాయి. హరియాణా (Haryana పోలీసులకు కూడా ఇదే చేదు అనుభవం ఎదురైంది. ఫుల్లుగా తాగిన ఓ వ్యక్తి అర్ధరాత్రి పోలీస్ కంట్రోల్ రూం హెల్ప్‌లైన్ నంబర్ 112 కు ఫోన్ చేశాడు. ప్రజలు ఏదైనా ప్రమాదంలో లేదా ఏదైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేస్తే పోలీసులు క్షణాల్లో సంఘటనా స్థలానికి చేరుకుంటటారు. ఫోన్ చేసిన వారికి తక్షణ సాయం అందిస్తారు. ఇక్కడ కూడా తాగుబోతు మాటలు విన్న పోలీసులు హుటాహుటిన అతను ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు.
ఈ క్రమంలో ఆ తాగుబోతు ‘పోలీసు కారు వచ్చిందా’ అని అక్కడకి వచ్చిన పోలీసులనే అడిగాడు. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. షాక్‌కి గురైన వారు ఎందుకు ఈ ఎమర్జెన్సీ నెంబర్ కాల్ చేశావని అతడిని ప్రశ్నించారు. ‘సాయంత్రం ఐదు గంటలకు రైళ్లు, కార్లు తిరగకపోవడంతో అసలు పోలీసులు పనిచేస్తున్నారో లేదో అనే సందేహం వచ్చింది. అందుకే కాల్ చేశాను’ అని తాగుబోతు సమాధానం ఇవ్వడంతో పోలీసులకు మతిపోతుంది. హరియాణాలోని పంచుకులలోని రాయ్‌పురానిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులకు ఫోన్ చేసిన తాగుబోతును 42 ఏళ్ల నరేష్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను హరియాణాకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ పంకజ్ నైనా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘మద్యం సేవించిన తర్వాత ప్రజలకు పోలీసులంటే బాగా గుర్తొస్తారు. రెండు రోజులుగా పోలీసు కారు కనిపించకపోవడంతో ఓ వ్యక్తి కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు’ అని షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.
पीने के बाद जनता को पुलिस की याद आती है। 2 दिन से पुलिस की गाड़ी नही दिखी तो 112 पे फ़ोन मिला लिया ??. घटना पंचकूला की है । ( PS – Police resources are already scarce , don’t misuse them ?) @police_haryana @112Haryana pic.twitter.com/5aQFLhs3Aq
— Pankaj Nain IPS (@ipspankajnain) February 9, 2022
Pushpa: సామీ సామీ పాటకు గర్భిణీ సూపర్ డ్యాన్స్.. నెటిజన్ల మది దోచుకుంటోన్న వైరల్ వీడియో..