AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanashree Verma: తల్లితో కలిసి కచా బాదం పాటకు కాలు కదిపిన చాహల్‌ సతీమణి.. నెటిజన్లను ఆకట్టుకుంటోన్న వీడియో..

ప్రస్తుతం సోషల్ మీడియాలో  కచా బాదం (kacha badam) సాంగ్ ఎంతలా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఈ బెంగాలీ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Dhanashree Verma: తల్లితో కలిసి కచా బాదం పాటకు కాలు కదిపిన చాహల్‌ సతీమణి.. నెటిజన్లను ఆకట్టుకుంటోన్న వీడియో..
Dhanashree Verma
Basha Shek
|

Updated on: Feb 15, 2022 | 5:54 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో  కచా బాదం (kacha badam) సాంగ్ ఎంతలా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఈ బెంగాలీ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ పాటకు డ్యాన్సులు వేస్తూ వాటిని ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌ రూపంలో సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటికి నెటిజన్ల నుంచి కూడా భారీ స్పందన వస్తోంది. ఇటీవల హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కచా బాదం పాటకు స్టె్ప్పులేసి అదరగొట్టింది. అంతకుముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ (Allu Arha).. ఈ బెంగాలీ పాటకు డ్యాన్స్‌చేసింది. తాజాగా టీమిండియా స్పి్న్నర్‌, యుజ్వేంద్ర చాహల్‌ సతీమణి, యూట్యూబర్‌ ధనశ్రీవర్మ (Dhanasree Verma)  కచాబాదం పాటకు కాలు కదిపింది. తల్లితో కలిసి సూపర్బ్‌గా స్టెప్పులేసింది. అనంతరం ‘మై ఫరెవర్‌ వాలంటైన్‌’ అంటూ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ గా మారింది.

తల్లీకూతుళ్లు కలిసి.. కేవలం చాహల్‌ భార్యగానే యూట్యూబర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ వర్మ. ఆమె చేసే డ్యాన్స్‌ వీడియోలకు మిలియన్లలో వ్యూస్‌, లక్షల్లో లైకులు వస్తుంటాయి. ఆమె గతంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, యంగ్ ప్లేయర్‌ శ్రేయస్‌ అయ్యర్‌తోనూ కలిసి డ్యాన్స్‌ చేసింది. ఈక్రమంలోనే మరోసారి కచాబాదం పాటకు కాలు కదిపింది. ఈ వీడియోలో ధనశ్రీ.. రెడ్ కలర్ మ్యాక్సీ డ్రెస్ ధరించగా.. ఆమె తల్లి రెడ్ కలర్ సల్వార్ సూట్ ధరించారు. కాగా ఈ వీడియోకు ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. అలాగే 4.5లక్షల మంది లైకులు కురిపించడం విశేషం. ఇద్దరూ చాలా క్యూట్ గా ఉన్నారని, డ్యాన్స్‌ బాగుందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

Also Read:Pushpa: సామీ సామీ పాటకు గర్భిణీ సూపర్‌ డ్యాన్స్‌.. నెటిజన్ల మది దోచుకుంటోన్న వైరల్‌ వీడియో..

Actor Ali: సీఎం జగన్‌తో సమావేశమైన నటుడు అలీ దంపతులు .. రాజ్యసభ సీటుపై మళ్లీ ఊపందుకున్న ఊహాగానాలు..

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఒకే వేదికపై రేవంత్‌ రెడ్డి, కోమటి రెడ్డి.. హ్యాపీ టైమ్స్ అంటూ టీపీసీసీ ట్వీట్‌..