AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut : పిల్లలను చెడగొడుతున్నారు.. మరోసారి శివాలెత్తిన కాంట్రవర్సీ క్వీన్

బాలీవుడ్‌లో వివాదాలకు క్రేరాఫ్ అడ్రస్‌గా మారింది హీరోయిన్ కంగనా రనౌత్. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.

Kangana Ranaut : పిల్లలను చెడగొడుతున్నారు.. మరోసారి శివాలెత్తిన కాంట్రవర్సీ క్వీన్
Kangana
Rajeev Rayala
|

Updated on: Feb 15, 2022 | 5:58 PM

Share

Kangana Ranaut : బాలీవుడ్‌లో వివాదాలకు క్రేరాఫ్ అడ్రస్‌గా మారింది హీరోయిన్ కంగనా రనౌత్. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఆమె సోషల్ మీడియా వేదికగా పెట్టే పోస్టులు.. చాలా వివాదాస్పదంగా ఉంటాయి. కొన్నిసార్లు ఉద్రిక్తతలు కూడా చెలరేగేలా చేస్తాయి. ఎప్పుడూ ఏదో ఓ విషయమై కంగనా వార్తల్లో ఉంటుంది. ఇటీవల దీపికా పదుకొనె నటించిన సినిమా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ‘గెహ్రాహియా’ సినిమాపైనా పరోక్షంగా స్పందించిన కంగన. స్కిన్​షో- అశ్లీలత ఏ సినిమాను సేవ్ చేయలేవంటూ రాసుకొచ్చింది. “బ్యాడ్​ మూవీస్ ఎప్పుడు బ్యాడ్ మూవీసే. స్కిన్​షో, రొమాన్స్ వాటిని ఏ మాత్రం సేవ్ చేయలేవు. ఇది చాలామందికి తెలిసిన విషయం”  అని కామెంట్స్ చేసింది. తాజా మరోసారి రెచ్చిపోయింది కంగనా.

అలియాభట్‌ హీరోయిన్‌ తెరకెక్కిన చిత్రం గంగూబాయి కతియావాడీ. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నారు. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముంబయికి చెంది మాఫీయా క్వీన్‌ గంగూబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించనుంది. ఆమె కామాతిపుర రెడ్ లైట్ ఏరియాలో నివాసం ఉంటూ అక్కడ మాఫియా డాన్ గా ఎదిగిన తీరును ఈ సినిమాలో చూపించనున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ లోని డైలాగులు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అలియా చెప్పిన డైలాగులను కొందరు రీల్స్ చేస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి కూడా అచ్చం అలియా భట్ మాదిరిగానే గెటప్ వేసుకొని నోటిలో బీడీ పట్టుకుని.. సినిమాలోని అభ్యంతరకర డైలాగ్ ను రీల్ గా చేసింది. ఈ వీడియో పై కంగనా ఫైర్ అయ్యింది. చిన్న పిల్లల పై ఇలాంటి సినిమాలు ప్రభావం చూపుతాయని.. వందల మంది పిల్ల దీనిని చూసి పాడైపోతారు.. అంటూ చెప్పుకొచ్చింది కంగనా.. ఇప్పుడు కంగనా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

DJ Tillu Movie : సడన్‌గా థియేటర్‌లో ప్రత్యక్షమైన డీజే టిల్లు టీమ్.. కేరింత‌లు కొట్టిన ఆడియన్స్

Balakrishna: బాలయ్యకు కూతురుగా క్రేజీ హీరోయిన్.. అనిల్ రావిపూడి సినిమాలో ఆ భామ..

Actor Ali: సీఎం జగన్‌తో సమావేశమైన నటుడు అలీ దంపతులు .. రాజ్యసభ సీటుపై మళ్లీ ఊపందుకున్న ఊహాగానాలు..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్