Balakrishna: బాలయ్యకు కూతురుగా క్రేజీ హీరోయిన్.. అనిల్ రావిపూడి సినిమాలో ఆ భామ..

రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించారు నందమూరి బాలకృష్ణ . బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలించింది విషయం తెలిసిందే.

Balakrishna: బాలయ్యకు కూతురుగా క్రేజీ హీరోయిన్.. అనిల్ రావిపూడి సినిమాలో ఆ భామ..
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 15, 2022 | 4:59 PM

Balakrishna: రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించారు నందమూరి బాలకృష్ణ . బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలించింది విషయం తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబోలో సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు బాలయ్య – బోయపాటి . ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న గోపీచంద్ ఇప్పుడు బాలకృష్ణ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశారు. ఇక ఏ ఈసినిమా షూటింగ్ ఇటీవలే పూజాకార్యక్రమాలతో మొదలైంది. ఈ మూవీలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా చేయనున్నారు.

బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనిల్ రావిపూడి ప్రయత్నిస్తున్నారు త్వరలోనే ఈ సినిమాగురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమా బాలకృష్ణ కు కు కూతురు పాత్ర కూడా ఉంటుందట. సుమారు 20ఏళ్ళ వయసున్న కూతురు పాత్ర కోసం ఓ కుర్ర హీరోయిన్ ను సంప్రదిస్తున్నారట. ఆ అమ్మడు ఎవరంటే.. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన శ్రీలీల. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటుంది. అయితే హీరోయిన్‌గా రాణిస్తున్న శ్రీలీల బాలయ్యకు కూతురు పాత్ర అనగానే వెంటనే ఓకే చెప్పిందని టాక్. ఇక ఈ విషయం పై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. Sri Leela

Sri Leelaమరిన్ని ఇక్కడ చదవండి : 

Deepika Pilli: దీపికా పిల్లి అందాల విందు మామూలుగా లేదుగా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్

కళ్లతోనే మాయ చేసిన అలనాటి నటి.. అందం, అభినయం కలబోసిన ఈ సీతాకోకచిలుక ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..

Manchu Vishnu: ఏపీ సీఎం జగన్‏తో భేటీ కానున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు.. సినీ పరిశ్రమ సమస్యలపై..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు