DJ Tillu Movie : సడన్‌గా థియేటర్‌లో ప్రత్యక్షమైన డీజే టిల్లు టీమ్.. కేరింత‌లు కొట్టిన ఆడియన్స్

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డీజే టిల్లు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ  సినిమాను నిర్మించింది.

DJ Tillu Movie : సడన్‌గా థియేటర్‌లో ప్రత్యక్షమైన డీజే టిల్లు టీమ్.. కేరింత‌లు కొట్టిన ఆడియన్స్
Dj Tillu
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 19, 2022 | 9:15 AM

DJ Tillu Movie : సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డీజే టిల్లు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ  సినిమాను నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ డీజే టిల్లు సినిమాను తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు.రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన  డీజే టిల్లు విడుదల అయిన అన్ని కేంద్రాలలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న డీజే టిల్లు ఇప్పుడు స‌క్సెస్ యాత్ర‌లో ప్రేక్ష‌కుల్ని క‌లుసుకుంటున్నాడు. ఈ సందర్భంగా తమ డీజే టిల్లు టీం విజ‌య‌యాత్ర లో భాగంగా గుంటూరులో ది సినిమాస్ ని సంద‌ర్శించారు. స‌డ‌న్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన టిల్లును చూసి కేరింత‌లు కొట్టారు ప్రేక్షకులు. థియేట‌ర్ లో ప్రేక్ష‌కులతో క‌ల‌సి చూసిన హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, హీరోయిన్ నేహా శెట్టి, ద‌ర్శ‌కుడు విమ‌ల్ ఆడియ‌న్స్ మ‌ధ్య కేక్ క‌ట్ చేసి స‌క్సెస్ ని సెల‌బ్రేట్ చేసుకున్నారు..

ఈ సంద‌ర్భంగా హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ.. డీజే టిల్లు స‌క్సెస్ మీతో సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. టిల్లు గాడు చేసే అల్ల‌రి మీతో క‌ల‌సి చూడ‌టం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మీన‌వ్వులు కామెంట్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాను..రాధికాకు ఫుల్ స‌రెండ‌ర్ అయినా ఆమె ఎట్లా అంటే అట్లా అంటూ టిల్లు స్ట‌యిల్ లో మాట్లాడి ఆక‌ట్టుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ.. సినిమా మీకు న‌చ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాధిక క్యారెక్ట‌ర్ మీకు న‌చ్చిందా..? అంటూ ఆడియ‌న్స్ తో క‌ల‌సి సినిమా చూడ‌టం చాలా సంతోషంగా ఉంది. మీ ఆద‌ర‌ణ‌కు చాలా రుణ ప‌డిఉంటాను అన్నారు. ఇక ద‌ర్శ‌కుడు విమ‌ల్ మాట్లాడుతూ.. ఆడియ‌న్స్ కి చాలా థ్యాంక్స్.. మీకు టిల్లు క్యారెక్ట‌ర్ ఎంత‌గా న‌చ్చిందో మీ కేరింత‌లు చెబుతున్నాయి అన్నారు.. మొత్తంగా చిన్న సినిమాగా వచ్చిన డీజే టిల్లు మంచి విజయాన్ని అందుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Deepika Pilli: దీపికా పిల్లి అందాల విందు మామూలుగా లేదుగా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్

కళ్లతోనే మాయ చేసిన అలనాటి నటి.. అందం, అభినయం కలబోసిన ఈ సీతాకోకచిలుక ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..

Manchu Vishnu: ఏపీ సీఎం జగన్‏తో భేటీ కానున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు.. సినీ పరిశ్రమ సమస్యలపై..

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే