Pushpa: సామీ సామీ పాటకు గర్భిణీ సూపర్‌ డ్యాన్స్‌.. నెటిజన్ల మది దోచుకుంటోన్న వైరల్‌ వీడియో..

సాధారణంగా గర్భం (Pregnancy) తో ఉన్నవారు సున్నితంగా ఉంటారు. ఇంటి నుంచి బయటకు కాలు పెట్టడానికి కూడా ఆలోచిస్తుంటారు. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా బాగా ఇబ్బంది పెడుతుంటారు.

Pushpa: సామీ సామీ పాటకు గర్భిణీ సూపర్‌ డ్యాన్స్‌.. నెటిజన్ల మది దోచుకుంటోన్న వైరల్‌ వీడియో..
Pushpa
Follow us
Basha Shek

|

Updated on: Feb 15, 2022 | 5:22 PM

సాధారణంగా గర్భం (Pregnancy) తో ఉన్నవారు సున్నితంగా ఉంటారు. ఇంటి నుంచి బయటకు కాలు పెట్టడానికి కూడా ఆలోచిస్తుంటారు. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా బాగా ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఆక్లాండ్‌కు చెందిన అబ్బేసింగ్‌ (Abbey Singh) అనే ఒక మహిళ నిండు గర్భంతో డ్యాన్స్‌ చేసింది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ‘పుష్ప’ సినిమాలోని ‘సామీసామీ’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. అనంతరం ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ‘గత కొన్ని రోజులుగా పుష్ప సినిమాలోని పాటలు బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సామీసామీ పాట నన్ను వీడడం లేదు. అందుకే ఈ పాటకు డ్యాన్స్ ట్రై చేశాను’ అని చెప్పుకొచ్చింది అబ్బేసింగ్‌. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు లైకుల మీద లైకులు కొడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అన్నట్లు కొద్ది రోజుల క్రితం ఈమె భర్త మనీసింగ్‌ కూడా పుష్ప సినిమాలోని ‘శ్రీవల్లి’ సాంగ్ సిగ్నేచర్‌ స్టెప్‌ను రీక్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పెట్టాడు.

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), క్రియేటివ్‌ డైరెక్టర్ సుకుమార్‌ (Sukumar) ల హ్యాట్రిక్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa). రష్మిక మందాన హీరోయిన్‌ గా నటించగా, సమంత స్పెషల్‌ సాంగ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియా చిత్రం గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కాగా ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఇందులోని పాటలు, డైలాగులు బాగా ఫేమస్‌ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు వీటిని అనుకరిస్తున్నారు. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. నెటిజన్లకు కూడా ఈవీడియోలు తెగనచ్చేస్తున్నాయి. ఇటీవల సూరత్‌లో అల్లు అర్జున్‌, రష్మిక పోస్టర్లతో ఏకంగా చీరలు తయారుచేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాకు ఎంతటి క్రేజ్‌ ఉందో.

Also Read: Balakrishna: బాలయ్యకు కూతురుగా క్రేజీ హీరోయిన్.. అనిల్ రావిపూడి సినిమాలో ఆ భామ..

Delhi Police: వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడి అరెస్ట్.. 16 గంటల్లో..

EIL Recruitment: ఇంజనీరింగ్ చేసిన వారికి బంపరాఫర్‌.. ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు..