Delhi Police: వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడి అరెస్ట్.. 16 గంటల్లో..

Delhi Police have arrested: పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్‌లో మంచానికే పరిమితమైన 87 ఏళ్ల వృద్ధురాలి (87-year-old woman) పై ఓ దుర్మర్గుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇంట్లోకి చొరబడిన కామాంధుడు..

Delhi Police: వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడి అరెస్ట్.. 16 గంటల్లో..
Arrest
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 15, 2022 | 4:41 PM

Delhi Police have arrested: పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్‌లో మంచానికే పరిమితమైన 87 ఏళ్ల వృద్ధురాలి (87-year-old woman) పై ఓ దుర్మర్గుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇంట్లోకి చొరబడిన కామాంధుడు.. ఆమెపై దాడి చేసి అత్యాచారం చేసి ఫోన్​దొంగలించుకొని పారిపోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అయితే.. వృద్ధురాలిపై అత్యాచారం చేసిన స్వీపర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం (ఫిబ్రవరి 15) తెలిపారు. ఆదివారం రాత్రి మహిళ కుమార్తె స్నేహితుడిని కలవడానికి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈమేరకు ఢిల్లీ (Delhi) పోలీసులు ట్వీట్‌ చేసి వెల్లడించారు. “తిలక్ నగర్‌లో వృద్ధురాలిపై లైంగిక దాడి కేసును ఛేదించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిని 16 గంటల్లో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడి నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నామని.. నిందితుడు సమీపంలోని ప్రాంతంలో నివసించే స్వీపర్ పని చేసే వ్యక్తి అని వెల్లడించారు.

కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 380, 323, 376 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే.. ఈ ఘటనలో పోలీసులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేశారని, తమ ఫిర్యాదును తీసుకోలేదని వృద్ధురాలి కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను అధికారులు ఖండించారు. ఆదివారం రాత్రి దొంగతనం ఫిర్యాదు మాత్రమే నమోదైందని, దాని ఆధారంగా తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. సోమవారం.. తనపై కూడా లైంగిక దాడి జరిగినట్లు ఫిర్యాదు చేశారని.. ఇదే కేసులో సంబంధిత ఐపిసి సెక్షన్లను జోడించినట్లు తెలిపారు.

మహిళ కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడని పోలీసులు తెలిపారు. వృద్ధురాలు గుర్తించి అతడిని ప్రశ్నించగా, తాను గ్యాస్‌ ఏజెన్సీలో పనిచేస్తున్నానని.. ఏదో పని నిమిత్తం ఇంటికి పిలిపించారని.. చెప్పాడు. అతను అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన మహిళ అలారం మోగించడానికి ప్రయత్నించగా, నిందితుడు ఆమెపై దాడి చేసి, లైంగికంగా వేధించి, ఆమె మొబైల్ ఫోన్‌ను దొంగిలించాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. వృద్ధురాలి కుమార్తె ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె గాయపడినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read:

Marriages: నిత్య పెళ్లికొడుకు.. ఏడు రాష్ట్రాలు.. 14 పెళ్లిళ్లు.. చివరకు ఏమైందంటే..?

Hyderabad: విద్యార్థులతో పాటు తల్లిదండ్రులపై కూడా కేసులు.. ఫేక్‌ సర్టిఫికేట్లపై సీపీ ఆనంద్‌ వార్నింగ్‌..