Robbery Video: మాస్క్‌లతో వచ్చారు.. రూ. కోటీ నగదుతో జంప్ అయ్యారు.! నెట్టింట వైరల్ అవుతున్న సీసీ టీవీ ఫోటేజ్..
ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఎప్పుడూ.. ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఘటన దేశంలోనే కలకలం రేపింది. తుపాకులతో ఓ కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు.. పాయింట్ బ్లాక్‌లో గన్ను పెట్టి కోటి రూపాయిలు దోచుకెళ్లారు.
ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఎప్పుడూ.. ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఘటన దేశంలోనే కలకలం రేపింది. తుపాకులతో ఓ కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు.. పాయింట్ బ్లాక్‌లో గన్ను పెట్టి కోటి రూపాయిలు దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఈ ఘటన ముంబైలోని ములుంద్ ప్రాంతంలోని ఓ సంస్థ కార్యాలయంలో చోటుచేసుకుంది. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు గన్నులతో వచ్చారు. అనంతరం అక్కడున్న వారిని బెదిరించి కోటి రూపాయల నగదుతో పారిపోయారు. పంచ రాస్తా ప్రాంతంలో ఆర్థిక సేవలు నిర్వహించే దుకాణంలో ఈ ఘటన జరిగింది. ఈ దోపిడీ ఘటన మొత్తం కార్యాలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయినట్లు పోలీసులు తెలిపారు.మాస్క్‌లు ధరించిన ముగ్గురు దుండగులు కార్యాలయంలోకి ప్రవేశించి పిస్టల్స్ సహాయంతో ఉద్యోగులను బందీలుగా పట్టుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. అనంతరం కార్యాలయంలో ఉంచిన నగదును బ్యాగులో వేసుకొని దోచుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Ranveer Singh: అమ్మాయిల కలల రాకుమారుడు.. నెట్టింట వైరల్ అవుతోన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఫోటోలు.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

