Sarkaru Vaari Paata: సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ పాటగా రికార్డు క్రియేట్ చేసిన క‌ళావ‌తి పాట‌..

సూపర్‌స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమాకోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sarkaru Vaari Paata: సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ పాటగా రికార్డు క్రియేట్ చేసిన క‌ళావ‌తి పాట‌..
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 15, 2022 | 8:14 PM

Sarkaru Vaari Paata: సూపర్‌స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమాకోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ మే 12 ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. మ‌హేశ్ స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో మహేష్ మరింత స్టైలిష్ గా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌ర‌పరిచిన ఫ‌స్ట్‌ సింగిల్ కళావతి  విడుద‌లై ట్రెమండ‌స్ రెస్పాన్స్ ద‌క్కించుకుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మన్, సింగ‌ర్ సిద్ శ్రీరామ్ మరియు లిరిసిస్ట్‌ అనంత శ్రీరామ్ సమిష్టి కృషితో ఈ పాట రికార్డు వ్యూస్ సాధించి మెలొడి సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా నిలిచింది. క‌ళావ‌తి పాట 24 గంట‌ల్లో 16 మిలియ‌న్ల వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన పాట‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక 24 గంట‌ల్లో ఈ పాటకు 806K లైక్స్ రావ‌డం విశేషం. ఇక ఇప్పుడు ఈ పాట 20 మిలియన్ వ్యూస్ దాటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

ఈ మూవీలో మహేష్ బాబును సరికొత్త అవతారంలో చూపించబోతోన్నారు దర్శకులు పరుశురాం. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. సర్కారు వారి పాట వేసవి కానుకగా మే 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

DJ Tillu Movie : సడన్‌గా థియేటర్‌లో ప్రత్యక్షమైన డీజే టిల్లు టీమ్.. కేరింత‌లు కొట్టిన ఆడియన్స్

Balakrishna: బాలయ్యకు కూతురుగా క్రేజీ హీరోయిన్.. అనిల్ రావిపూడి సినిమాలో ఆ భామ..

Actor Ali: సీఎం జగన్‌తో సమావేశమైన నటుడు అలీ దంపతులు .. రాజ్యసభ సీటుపై మళ్లీ ఊపందుకున్న ఊహాగానాలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!