Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఆ సేవలకు రేపటి నుంచి టికెట్లు కేటాయింపు..
Tirumala: కలియుగ దైవం కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి(Tirumala Tirupati). స్వామివారి పేరుతో టిటిడి(TTD) అనేక ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తుంది. ఈ నేపధ్యంలో తిరుపతిలో..
Tirumala: కలియుగ దైవం కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి(Tirumala Tirupati). స్వామివారి పేరుతో టిటిడి(TTD) అనేక ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తుంది. ఈ నేపధ్యంలో తిరుపతిలో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం టిటిడి దాతల నుండి విరాళాలు ఆహ్వానిస్తోంది. రేపు ( ఫిబ్రవరి 16) బుధవారం ఉదయం 9.30 గంటలకు ఆన్‌లైన్‌లో విరాళాల స్వీకరణ ప్రారంభం కానుంది. https://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దాతలు విరాళాలు సమర్పించవచ్చునని టిటిడి అధికారులు ప్రకటించారు.
వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు ఖాళీ అయిన 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను దాతలకు అందుబాటులో ఉంచడమైందని చెప్పారు. ఉదయాస్తమాన సేవా టికెట్ల కోసం వారంలో శుక్రవారం రోజుకైతే రూ.1.50 కోట్లు, మిగిలిన రోజుల్లో అయితే ఒక కోటి రూపాయలను దాతలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా పారదర్శకంగా ఈ సేవా టికెట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా టిటిడి అధికారులు కోరుతున్నారు.
వ్యక్తిగతంగా విరాళమిచ్చిన భక్తులకు 25 ఏళ్లు పాటు సంవత్సరంలో ఒక రోజు దాతతో కలిపి ఆరు గురికి ఉదయస్తమాన సేవను కల్పించనుండి. అదే ఏవైనా కంపెనీలు అయితే 20 ఏళ్ల పాటూ ఉదయస్తమాన సేవను కల్పించనుంది.
శని, ఆది, సోమవారాల్లో ఉదయస్తమాన సేవ భక్తులకు సుప్రభాతం, తోమాల, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే అవకాశం కలుగుతుందని ప్రకటించింది.
మంగళ, బుధ,గురువారాల్లో టికెట్లు పొందిన భక్తులకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాదపద్మారాధన (మంగళవారం), తిరుప్పావడ సేవ(గురువారం), కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది.
అదే శుక్రవారాల్లో ఉదయస్తమాన సేవా టికెట్లు కలిగిన భక్తులకు సుప్రభాతం, అభిషేకం, తోమాల, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే అవకాశం ఇస్తోంది.
Also Read: